బిగ్‌బాస్ ఇంట్లో యాక్టివ్‌గా కనిపించే వ్యక్తుల్లో నోయల్ ఒకడు. తొలి వారం నుంచే అన్ని టాస్క్‌ల్లో యాక్టివ్‌గా ఉంటూ కీలకంగా కనిపించాడు. అయితే పడవ టాస్క్ విషయంలో నాగార్జున కోప్పడటం, ఆ తర్వాత ‘ఉక్కు హృదయం’ టాస్క్ సందర్భంగా వరస్ట్ పర్‌ఫార్మర్‌గా నిలిచి జైలుకు వెళ్లడంతో నోయల్ కాస్త డౌన్ అయినట్లు కనిపించాడు. ఈ విషయాన్ని నాగార్జున కూడా ఓ సందర్భంలో అడిగాడు. అయితే ఇప్పుడు మళ్లీ నోయల్ యాక్టివ్ అయ్యే సమయం వచ్చింది. ఎందుకంటే బిగ్‌బాస్ ఇంటి కొత్త కెప్టెన్‌గా నోయల్ ఎంపికయ్యాడు.
కెప్టెన్సీ పోటీ దారుల టాస్క్‌లో గెలిచిన బ్లూ టీమ్ కెప్టెన్సీ కోసం ‘కొట్టు తలతో ఢీకొట్టు’ అనే గేమ్ ఆడింది. లివింగ్ ఏరియాలో కొన్ని బాల్స్ వేసి… పోటీదారుల తలకు ఓ బ్యాటున్న హెల్మెట్ పెట్టారు. దాంతో బాల్స్‌ను గోల్‌లో వేయమన్నారు. ఈ గేమ్‌లో నోయల్ అత్యధికంగా బాల్స్ గోల్‌లో వేసి విజయం సాధించాడు. అలా ఇంటికి కొత్త కెప్టెన్ అయ్యి… బ్యాడ్జ్ ధరించాడు. అయితే బిగ్‌బాస్ నోయల్‌కు ఓ షాక్ ఇచ్చాడు.
వచ్చే వారం డైరెక్ట్‌గా నామినేట్ అయిన కారణంగా… కెప్టెన్సీకి లభించే ఇమ్యూనిటీ నోయల్‌కు లభించదు. అంటే వచ్చే వారం నామినేషన్ నుంచి డైరెక్ట్ సేఫ్ అవ్వలేరు. కెప్టెన్ అయ్యాక ‘నాన్నా నీ కొడుకు కెప్టెన్ అయ్యాడు.. తొడ కొట్టు’ అంటూ నోయల్ మునపటి ఉత్సాహం చూపించాడు. చూద్దాం ఈ వారం మొత్తం ఇలానే ఉంటాడా. లేక తన కాలు ఇబ్బంది వల్ల డౌన్ అయిపోతాడా అనేది చూడాలి. అన్నట్లు తదుపరి రేషన్ మేనేజర్‌గా మోనాల్ – మెహబూబ్ మధ్య పోటీ నెలకొంది. ఆఖరికి నోయల్ తన ఓటును మెహబూబ్‌కి వేశాడు.