“పెళ్ళిచూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం” లాంటి సెన్సేషనల్ హిట్స్ అనంతరం విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం “నోటా”. పాలిటిక్స్ నేపధ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ యంగ్ & రౌడీ సీయం గా కనిపించనుండగా.. “ఇంకొక్కడు” ఫేమ్ ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించారు. మెహరీన్ కథానాయికగా నటించిన ఈ చిత్రం తెలుగు-తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదలకానుండగా తమిళ సెన్సార్ వారం ముందే పూర్తయ్యింది. తెలుగు వెర్షన్ సెన్సార్ ను సోమవారం నిర్వహించారు.
సినిమా చూసిన సెన్సార్ బోర్డ్ సభ్యులు కంటెంట్ స్ట్రాంగ్ గా ఉందని, విజయ్ దేవరకొండ ఈ చిత్రంలో నట విశ్వరూపం ప్రదరించాడని చెప్పారట. అయితే.. సినిమాలోని ప్రస్తుత రాజకీయ పోకడ గురించిన కొన్ని పంచ్ లు, రెచ్చగొట్టే లేక కొన్ని రాజకీయ పార్టీలను హార్ట్ చేసే విధంగా ఉన్న కొన్ని సన్నివేశాలను తొలగించాలని సూచించారట. మొదట్లో కాస్త రిక్వెస్ట్ చేసైనా ఆ సన్నివేశాలు సినిమాలో ఉండేలా చేద్దామనుకొన్న చిత్రబృందం రిలీజ్ ఎక్కువ సమయం లేకపోవడంతో సెన్సార్ సభ్యులు చెప్పిన మార్పులతో ఇవాళ సినిమాను సబ్మిట్ చేసి సర్టిఫికెట్ అందుకోనున్నారు.
ఈ సినిమా రిజల్ట్ ఎఫెక్ట్ విజయ్ దేవరకొండ కెరీర్ పై పడనుంది. ఎందుకంటే.. ఇప్పటివరకూ హిట్ అయిన అతడి సినిమాల సక్సెస్ క్రెడిట్స్ అన్నీ డైరెక్టర్స్ లేక ప్రొడ్యూసర్స్ ఎకౌంట్ లోకి వెళ్లిపోయాయి. సో, “నోటా” సినిమా సక్సెస్ మాత్రం తమిళంలో ఎలా ఉన్నా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం విజయ్ దేవరకొండ క్రేజ్ & స్టార్ డమ్ ను వేల్యూయేట్ చేయనున్నాయి. మరి సినిమా రిజల్ట్ ఏమిటనేది మరో 48 గంటల్లో తెలిసిపోనుంది కాబట్టి అప్పటివరకూ వెయిట్ చేయడమో లేక ఓవర్సీస్ ట్విట్టర్ టాక్ బట్టి రిజల్ట్ గెస్ చేయడమో చేయాలి.