Jr NTR: 2022 సంవత్సరం తారక్ కు కలిసొస్తుందా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు ఎన్టీఆర్ సినిమా రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ గత ఐదు సినిమాలతో విజయాలను అందుకోగా ఆర్ఆర్ఆర్ మూవీతో ఎన్టీఆర్ డబుల్ హ్యాట్రిక్ అందుకుంటారని ఫ్యాన్స్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. అయితే ఈ సినిమా ఎప్పుడు రిలీజవుతుందో ఎవరూ కచ్చితంగా చెప్పలేకపోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ డేట్ నాలుగుసార్లు మారడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. మరోవైపు ఎన్టీఆర్ తర్వాత సినిమా కొరటాల శివ డైరెక్షన్ లో ఫిక్స్ కాగా ఈ సినిమాను ఏప్రిల్ 29వ తేదీన విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు.

అయితే ఈ సినిమా షూటింగ్ మొదలుకాకపోవడంతో ఆ తేదీకి ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో మూవీ రిలీజయ్యే అవకాశం అయితే దాదాపుగా లేదనే కామెంట్లు మాత్రం వినిపిస్తుండటం గమనార్హం. 2022 సంవత్సరం అయినా తారక్ కు కలిసొస్తుందా? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. మిగతా స్టార్ హీరోలు ఒకే సమయంలో రెండు లేదా మూడు సినిమాలలో నటిస్తుండగా జూనియర్ ఎన్టీఆర్ మాత్రం సరైన ప్లానింగ్ లేకపోవడంతో కెరీర్ విషయంలో వెనుకబడ్డారు. వేగంగా తారక్ సినిమాల్లో నటించి ఆ లోటును పూడ్చాలని అభిమానులు కోరుకుంటున్నారు.

తారక్ మనస్సులో ఏముందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తారక్ ఒక సినిమాకు ఓకే చెప్పారు. అయితే ఈ సినిమా కూడా సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది. 2021 సంవత్సరంలో తారక్ హోస్ట్ గా వ్యవహరించిన ఎవరు మీలో కోటీశ్వరులు షో ఫ్లాప్ అయింది. తారక్ సినిమాల విషయంలో ప్లాన్ మార్చాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ డేట్ గురించి త్వరగా క్లారిటీ వస్తే బాగుంటుందని అభిమానులు భావిస్తున్నారు.

ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో మూవీ ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందో తెలియాల్సి ఉంది. ఆర్ఆర్ఆర్ విడుదలై సక్సెస్ సాధిస్తే తారక్ రెమ్యునరేషన్ కూడా పెరుగుతుంది. ఆర్ఆర్ఆర్ మూవీకి తారక్ 45 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నారు.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Share.