టాలీవుడ్ ఇండస్ట్రీలో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్ లకు ఊహించని స్థాయిలో క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సినిమాల కలెక్షన్లతో సంబంధం లేకుండా ఈ హీరోల సినిమాలకు అంచనాలకు మించి బిజినెస్ జరుగుతోంది. అయితే టైర్2 హీరోలలో ఉన్న కొంతమంది హీరోల మధ్య కూడా గట్టి పోటీ ఉంది. వరుసగా బ్లాక్ బస్టర్ హిట్లు సాధించకపోవడం వల్ల ఈ హీరోలు టైర్1 హీరోల జాబితాలో చేరే విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ హీరోల జాబితాలో విజయ్ దేవరకొండ, నాని, శర్వానంద్, నాగచైతన్య, అఖిల్, రామ్ ఉన్నారు. ఇస్మార్ట్ శంకర్ సినిమా 40 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించడంతో హీరో రామ్ మార్కెట్ పెరిగింది. నెగిటివ్ టాక్ తో రామ్ ఈ స్థాయిలో కలెక్షన్లను సాధించారు. రెడ్ సినిమా మంచి కలెక్షన్లను అందుకోకపోయినా లింగుస్వామి, బోయపాటి శ్రీను, హరీష్ శంకర్ డైరెక్షన్ లో నటిస్తూ రామ్ మార్కెట్ ను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ సినిమాల ఫలితాలను బట్టి రామ్ ఈ జాబితాలో నంబర్1 స్థానంలో నిలుస్తారో లేదో చూడాల్సి ఉంది. అర్జున్ రెడ్డి, గీతా గోవిందం సినిమాలతో భారీ బ్లాక్ బస్టర్ హిట్లను విజయ్ దేవరకొండ ఖాతాలో వేసుకున్నారు. లైగర్ సినిమా సక్సెస్ సాదిస్తే టైర్2 హీరోల జాబితాలో విజయ్ దేవరకొండ నంబర్1 స్థానంలో నిలిచే అవకాశాలు ఉన్నాయి. మరో హీరో నాని గత సినిమా శ్యామ్ సింగరాయ్ హిట్ టాక్ తెచ్చుకున్నా కలెక్షన్లు ఆశించిన స్థాయిలో రాలేదు.
అంటే సుందరానికి, దసరా సినిమాల ఫలితాలను బట్టి ఈ జాబితాలో నాని నంబర్1 స్థానంలో నిలుస్తారో లేదో తేలిపోనుంది. వరుసగా నాలుగు విజయాలతో జోరుమీదున్న నాగచైతన్య థాంక్యూ, లాల్ సింగ్ చద్దా సినిమాలతో విజయాలను అందుకుంటే ఈ జాబితాలో నంబర్ వన్ స్థానంలో నిలవనున్నారు. అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో సక్సెస్ ను అందుకోగా ఏజెంట్ సినిమాతో సక్సెస్ సాధిస్తే నంబర్1 స్థానానికి అఖిల్ పోటీ ఇస్తారో లేదో తెలియాల్సి ఉంది.
వరుస ఫ్లాపులతో ఢీలా పడిన శర్వానంద్ సక్సెస్ సాధిస్తే మాత్రమే ఇతర హీరోలకు పోటీ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. నాని, విజయ్ దేవరకొండ మధ్య మాత్రమే ప్రస్తుతం గట్టి పోటీ ఉండగా విజయ్ టైర్2 హీరోలలో నంబర్1 హీరో అని చాలామంది భావిస్తున్నారు.