టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలలో సినిమాల బడ్జెట్లు పెరుగుతున్నాయి. బడ్జెట్లకు అనుగుణంగా సినిమాలకు బిజినెస్ జరగాలని నిర్మాతలు సైతం కోరుకుంటున్నారు. సౌత్ సినిమాలకు గత కొన్నేళ్లతో పోలిస్తే ఓవర్సీస్ మార్కెట్ పెరుగుతోంది. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే ఓవర్సీస్ లో సైతం కళ్లు చెదిరే స్థాయిలో కలెక్షన్లు వస్తున్నాయి. ఓవర్సీస్ హక్కుల విషయంలో నిర్మాతల డిమాండ్లు కూడా భారీ స్థాయిలో ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాకు నిర్మాతలు 18 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తుండగా
సూర్య కంగువా (Kanguva) సినిమా అన్ని భాషల ఓవర్సీస్ హక్కులకు నిర్మాతలు ఏకంగా 45 కోట్ల రూపాయలకు అటూఇటుగా డిమాండ్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమాల ఓవర్సీస్ డీల్స్ ఈ మొత్తానికి అటూఇటుగా ఫైనల్ అయ్యే ఛాన్స్ అయితే ఉందని చెప్పవచ్చు. హాయ్ నాన్న సినిమాకు సంబంధించి 8 కోట్ల రూపాయలకు, స్కంధ సినిమాకు సంబంధించి 5 కోట్ల రూపాయలకు ఓవర్సీస్ హక్కులకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయని భోగట్టా.
అటు చిన్న సినిమాల బిజినెస్ లో, ఇటు పెద్ద సినిమాల బిజినెస్ లో ఓవర్సీస్ హక్కులు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఒకప్పుడు క్లాస్ సినిమాలకు మాత్రమే ఓవర్సీస్ లో ఆదరణ దక్కగా ఇప్పుడు మాస్ సినిమాలకు సైతం ఆదరణ దక్కుతోంది. అయితే నిర్మాతలు మరీ భారీ మొత్తం డిమాండ్ చేయడం కూడా కరెక్ట్ కాదని కామెంట్లు వినిపిస్తున్నాయి.
రాబోయే రోజుల్లో పెద్ద సినిమాల ఓవర్సీస్ హక్కులు 100 కోట్ల రూపాయల మార్కును దాటినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఓవర్సీస్ లో ఇక్కడితో పోల్చి చూస్తే టికెట్ రేట్లు భారీగా ఉండటం వల్ల కూడా ఈ సినిమాల హక్కులకు ఈ స్థాయిలో డిమాండ్ ఏర్పడటంతో పాటు భారీ స్థాయిలో కలెక్షన్లు వస్తున్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.