ప్రముఖ సినీ నిర్మాత అలాగే వైసీపీ నేత అయిన ప్రసాద్ వి.పొట్లూరి(పీవీపీ) పై ఇటీవల బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. ‘కైలాస్ అనే వ్యక్తికి తన విల్లాను అమ్మాడు పివిపి. అది హ్యాండోవర్ చేసుకున్నాక కైలాస్ తనకు నచ్చినట్టు రెనోవేషన్ చేయించుకోవడానికి పనులు మొదలు పెట్టాడు. ఇది తెలుసుకున్న పివిపి.. తన ఇంటిని ఇష్టం వచ్చినట్టు రెనోవేషన్ చెయ్యకూడదు అంటూ దౌర్జన్యానికి దిగాడట. అయితే ఈ ఇంటిని కోలుగోలు చేసి నాకు నచ్చినట్టు చేసుకుంటే..
నీకెందుకు? అంటూ కైలాస్ ప్రశ్నించడంతో.. 30మందిని పెట్టి దాడి చేయించాడట పివిపి’.ఆ కారణంగా కైలాస్ పోలీసులను ఆశ్రయించాడని తెలుస్తుంది. దాంతో పివిపి పై కేసు బుక్ చేశారు పోలీసులు.ఇక ఈరోజు పివిపిని.. విచారణకు పిలిచేందుకు అతని ఇంటికి పోలీసులు వెళ్లారు. అయితే అలా వెళ్లిన పోలీసుల పై తన పెంపుడు కుక్కలను ఉసిగొల్పాడట పివిపి. దీంతో పోలీసులు భయపడి అక్కడి నుండీ వెళ్లిపోయారని సమాచారం. దీంతో ఈ ఘటన పై జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో మరో కేసు పివిపి పై నమోదు చేసినట్టు తెలుస్తుంది.
ఎస్సై హరీశ్‌రెడ్డి ఫిర్యాదు మేరకు ఐపీసీ 353 కింద పివిపి పై కేసు పెట్టినట్టు తెలుస్తుంది. ఈ సంఘటనకు గాను పోలీసులు పివిపి పై చాలా కోపంగా ఉన్నారట. ఇక ఈ విషయం పై యాక్షన్ తీసుకునేందుకు.. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ వెళ్లనున్నట్టు సమాచారం.