Hari Hara Veera Mallu: ‘హరి హర వీరమల్లు’ మంచి డేట్ మిస్ చేసుకుంటుందా..?!
- April 23, 2025 / 10:00 AM ISTByPhani Kumar
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) 27వ సినిమాగా ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) మొదలైంది. క్రిష్ (Krish Jagarlamudi) దర్శకత్వంలో ఏ.ఎం.రత్నం (AM Rathnam) నిర్మాణంలో ఈ సినిమా మొదలైంది. 2020 ఆరంభంలో ఆల్మోస్ట్ ‘వకీల్ సాబ్’ (Vakeel Saab) రిలీజ్ టైంలోనే ఈ సినిమా కూడా మొదలైంది. కానీ ఇప్పటికీ ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అవ్వలేదు. దీని తర్వాత మొదలైన ‘భీమ్లా నాయక్’ (Bheemla Nayak) ‘బ్రో’ (BRO) సినిమాలు స్టార్ట్ అవ్వడం తర్వాత కంప్లీట్ అయ్యి ప్రేక్షకుల ముందుకు రావడం జరిగాయి. అయినా ‘హరి హర వీరమల్లు’ ఇంకా కంప్లీట్ అయ్యింది లేదు.
Hari Hara Veera Mallu

ఈ ప్రాజెక్టు లేట్ అవుతుందని భావించి.. దర్శకుడు క్రిష్ మధ్యలో ‘కొండపొలం’ (Konda Polam) అనే సినిమా కంప్లీట్ చేశాడు. అయినా రెగ్యులర్ షూటింగ్ జరగకపోవడం వల్ల ఈ ప్రాజెక్టు నుండి తప్పుకున్నాడు. మరోపక్క అనుష్కతో (Anushka Shetty) ‘ఘాటి’ (Ghaati) సినిమాను మొదలు పెట్టడం, కంప్లీట్ చేయడం కూడా జరిగిపోయాయి.ఈ కారణాల వల్ల ఏ.ఎం.రత్నం కొడుకు రత్నం కృష్ణ (Jyothi Krishna ) ప్రాజెక్టుని టేకప్ చేసి.. బ్యాలెన్స్ షూటింగ్ ని ఫినిష్ చేస్తున్నారు. కొద్దిపాటి పోర్షన్ తప్ప మొత్తం ఫినిష్ అయ్యింది.

ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ ను 5 సార్లు పోస్ట్ పోన్ చేశారు. ఈ ఏడాది అయితే మూడో సారి పోస్ట్ అవుతుంది అనే టాక్ వినిపిస్తోంది. 2025 మార్చి 28న ‘హరిహర వీరమల్లు’ ని రిలీజ్ చేస్తారు అనే టాక్ నడిచింది. కానీ తర్వాత మే 9కి వాయిదా వేసినట్టు అధికారిక ప్రకటన వచ్చింది. ఇప్పుడు ఈ డేట్ కి కూడా సినిమా వచ్చేలా కనిపించడం లేదు.

జూన్ 24 కి పోస్ట్ పోన్ అవుతున్నట్టు టాక్ నడుస్తుంది. ఒకవేళ అదే నిజమైతే పవన్ కళ్యాణ్ మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నట్టే అని చెప్పాలి. ఎందుకంటే సమ్మర్లో ఒక్క పెద్ద సినిమా కూడా రిలీజ్ కావడం లేదు. ఓ పెద్ద సినిమా కనుక రిలీజ్ అయితే… ఆడియన్స్ ఎగబడి థియేటర్లకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు ‘హరి హర వీరమల్లు’ బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి.

వంద కోట్ల షేర్ క్లబ్లో కూడా పవన్ చేరే అవకాశం ఉండేది. ఇప్పుడు జూన్ 24 అంటే.. నెలాఖరు టైం..! అప్పుడు జనాల దగ్గర డబ్బులు ఉండకపోవచ్చు. పైగా జూలై నెలలో వరుసగా సినిమాలు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. అప్పుడు ‘హరి హర వీరమల్లు’ ని ఆడియన్స్ పక్కన పెట్టేసే ప్రమాదం కూడా లేకపోలేదు.

















