Vijay Devarakonda: ‘పెళ్ళిచూపులు’ కాంబో మరోసారి.. కాకపోతే ఈసారి..!
- May 7, 2025 / 06:28 PM ISTByPhani Kumar
తరుణ్ భాస్కర్ (Tharun Bhascker)… పరిచయం అవసరం లేని పేరు. ‘పెళ్ళిచూపులు’ తో (Pelli Choopulu) దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ‘ఈ నగరానికి ఏమైంది?’ (Ee Nagaraniki Emindhi) వంటి సెలబ్రేటెడ్ మూవీని యూత్ కు అందించారు.అటు తర్వాత వెంకటేష్ తో సినిమా చేయాల్సింది. కానీ ఎందుకో ఆ ప్రాజెక్టు సెట్ అవ్వడం లేదు. తర్వాత ఎందుకో తరుణ్ భాస్కర్ కి కెరీర్లో గ్యాప్ వచ్చింది. ‘కీడా కోలా’ (Keedaa Cola) ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరినా, సురేష్ బాబు (D. Suresh Babu) వంటి స్టార్ ప్రొడ్యూసర్ సపోర్ట్ కలిగి ఉన్నా..
Vijay Devarakonda

ఎందుకో తరుణ్ భాస్కర్ పెద్ద హీరోలతో సినిమాలు సెట్ చేసుకోలేకపోతున్నాడు. మరోపక్క తరుణ్ భాస్కర్ హీరోగా, విలక్షణ నటుడిగా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఇక తరుణ్ భాస్కర్ కు విశ్వక్ సేన్ (Vishwak Sen), విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)..లతో మంచి ఫ్రెండ్షిప్ ఉంది. విజయ్, విశ్వక్… ఇద్దరూ లైమ్ లైట్లోకి వచ్చింది తరుణ్ భాస్కర్ సినిమాల వల్లనే అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఇప్పుడు ఈ ఇద్దరు హీరోలు వరుస ప్లాపులతో సతమతమవుతున్నారు.

తరుణ్ కూడా ఓ పెద్ద హిట్ కొట్టి… మళ్ళీ తన సత్తా చాటాలని చూస్తున్నాడు. ఈ క్రమంలో విశ్వక్, విజయ్ ..లు మాత్రమే అతని ముందున్న ఆప్షన్. అందుకే విశ్వక్ తో ఓ సినిమా చేయాలని అనుకున్నాడు. కానీ కుదర్లేదు. దీంతో వెంటనే అదే కథతో విజయ్ దేవరకొండని అప్రోచ్ అయ్యాడట. విజయ్ కి కథ నచ్చడంతో వెంటనే ఓకే చెప్పినట్టు సమాచారం. త్వరలోనే వీరి ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి.












