ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్ల ఇష్యు ఇంకా ఓ కొలిక్కి వచ్చినట్లు కనిపించడం లేదు. ఏపీలో ఆన్ లైన్ టికెటింగ్ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ అయ్యింది. మరోసారి ఇది కోర్టు మెట్లెక్కడం కూడా జరిగింది. సినిమా టికెట్లను ప్రభుత్వం అప్రూవ్ చేసిన పోర్టల్ ద్వారానే అమ్మాలని.. మొత్తంగా వచ్చిన డబ్బుని నెల రోజుల్లో డిస్ట్రిబ్యూటర్ల ఖాతాలో వేసేలా ఈ పద్దతిని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఆన్ లైన్ ద్వారానే టికెట్లు విక్రయించాలంటూ జీవో కూడా పాస్ చేసింది.
ఈ జీవోని ఉల్లంఘించకుండా తప్పకుండా పాటించాలని హెచ్చరికలు జరీ చేయడం కూడా జరిగింది. కొద్దిరోజులుగా థియేటర్ యజమానుల పై ఒత్తిడి చేస్తూ రెవెన్యూ అధికారులు కూడా తెగ తిరుగుతున్నారు.ఈ క్రమంలో ఈ పద్దతిని వ్యతిరేకిస్తూ సంతకాలు చేయడానికి నిరాకరించిన థియేటర్ యాజమాన్యాల పై కఠిన చర్యలు తీసుకుంటున్నారు.ఆల్రెడీ చిలుకూరు పేటలో 5 థియేటర్లు సీజ్ చేశారు. ఈ జీవోని వ్యతిరేకిస్తూ కొంతమంది హైకోర్టులో పిటిషన్ వేశారు. ‘బిగ్ బి ఎంటర్‌టైన్మెంట్స్’ సంస్థ తరుపున వారు హై కోర్టుని ఆశ్రయించడం జరిగింది.
దీనిని క్షుణ్ణంగా పరిశీలించిన కోర్టు.. ఆపొనెంట్స్ అయిన న్యాయ, శాసనశాఖ కార్యదర్శి, ఏపీ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్, థియేటర్ డవలెప్మెంట్ కార్పొరేషన్ లతో సహా ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్‌లకు నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ విషయం పై కౌంటరు దాఖలు చేయాలని కూడా అందులో పేర్కొంది. గతంలో కూడా ఏపీ ప్రభుత్వం తీరుని వ్యతిరేకిస్తూ కొంతమంది కోర్టుకెక్కారు.
ఈసారి కూడా అలాంటి సీన్ రిపీట్ అయ్యింది. తదుపరి విచారణను జూన్ 27కు వాయిదా వేసింది హైకోర్టు. ఆరోజు ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన జీవో పై మీడియేటర్స్ కౌంటర్స్ దాఖలు చేసే అవకాశం ఉంది.