అక్కినేని నాగార్జున (Nagarjuna), కార్తీ (Karthi) ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ‘ఊపిరి’ (Oopiri). వంశీ పైడిపల్లి (Vamshi Paidipally) ఈ సినిమాకు దర్శకుడు. ‘పీవీపీ సినిమాస్’ బ్యానర్ పై ప్రసాద్ వి పొట్లూరి (Potluri Vara Prasad), కెవిన్ అన్నే ఈ చిత్రాన్ని నిర్మించారు. 2016 మార్చి 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘ది ఇన్-టచబుల్స్’ అనే హాలీవుడ్ సినిమా ఆధారంగా రూపొందింది ‘ఊపిరి’ సినిమా. అయితే దర్శకుడు వంశీ పైడిపల్లి ఈ సినిమాను బాగా ఓన్ చేసుకుని డైరెక్ట్ చేశాడేమో అనిపిస్తుంది.
క్లాస్ సినిమా కదా స్లో ఉంటుంది అనే ఫీలింగ్ రాకుండా స్క్రీన్ ప్లే బాగా మ్యాజిక్ చేసింది. అందుకే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా క్లీన్ హిట్ గా నిలిచింది. నేటితో ఈ సినిమా రిలీజ్ అయ్యి 9 ఏళ్ళు పూర్తి కావస్తోంది. మరి ఫుల్ రన్లో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :
నైజాం | 8.45 cr |
సీడెడ్ | 3.25 cr |
ఉత్తరాంధ్ర | 3.03 cr |
ఈస్ట్ | 1.95 cr |
వెస్ట్ | 1.31 cr |
గుంటూరు | 2.14 cr |
కృష్ణా | 1.73 cr |
నెల్లూరు | 0.85 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 22.71 cr |
తమిళనాడు | 14.91 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 6.30 cr |
ఓవర్సీస్ | 8.38 cr |
వరల్డ్ వైడ్ టోటల్ | 52.30 cr |
‘ఊపిరి’ చిత్రం వరల్డ్ వైడ్ గా రూ.44 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. అయితే ఫుల్ రన్లో ఏకంగా రూ.52.3 కోట్ల షేర్ ను రాబట్టింది. మొత్తంగా రూ.8.3 కోట్లతో ఈ సినిమా క్లీన్ హిట్ గా నిలిచింది.