కన్ను కొట్టే క్లిప్ తో దేశం మొత్తం యువకులను ప్రియా వారియర్ ఆకర్షించింది. అలాగే మిలియన్ ఫాలోవర్స్ ని సంపాదించుకుంది. ఈ కేరళ బ్యూటీ నటించిన తొలి సినిమా “ఓరు ఆధార్ లవ్” ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. ఇందులోని ఓ సాంగ్ ని రిలీజ్ చేయగా ఊహించని రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఆ చిత్ర దర్శకనిర్మాతలు టీజర్ ని రిలీజ్ చేశారు. ఈ సారి ప్రియా ముద్దు గన్ తో ఆకట్టుకుంది. ఈ టీజర్ కి వచ్చిన క్రేజ్ చూసి తెలుగు నిర్మాతలను ఈ సినిమా డబ్బింగ్ హక్కుల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలిసింది. టాలీవుడ్ వారే కాకుండా కోలీవుడ్ వారు కూడా క్యూ లో ఉన్నట్లు సమాచారం.
అయితే “ఓరు ఆధార్ లవ్” చిత్ర నిర్మాత మాత్రం ఇప్పుడే బిజినెస్ మొదలెట్టే ఆలోచన లేదని తేల్చి చెప్పారంట. ఇంకా సినిమా పూర్తి కాలేదు.. పైగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత మరింత క్రేజ్ రావడం గ్యారంటీ.. ఆ క్రేజ్ ని క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకే మూవీ షూటింగ్ స్పీడ్ పెంచారు. కొత్త నటీనటులతో తెరకెక్కిన ఈ సినిమాకి షాన్ రెహమాన్ సంగీతం సమకూర్చారు. ఒమర్ లులు దర్శకత్వం వహించిన ఈ మూవీ మార్చి 3న రిలీజ్ కానుంది. అప్పుడు ఇంకెంతమందిని ప్రియా తన ఫాలోవర్స్ గా చేసుకుంటుందో చూడాలి.