మనం ఎప్పుడూ చెప్పుకున్నట్లే కొన్ని పుకార్లు వినడానికి ఆసక్తికరంగా ఉంటాయి. నిజమైతే బాగుండు అనిపిస్తుంది. ఒకవేళ నిజం కాకపోతే అయ్యో అయ్యుంటే బాగుండు అని కూడా అనిపిస్తుంది. ఇప్పుడు ఇలాంటి పుకారు ఒకటి టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. ఆ వార్త చూసి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఫ్యాన్స్‌కి ఆకాశంలో తేలిపోయేటంత ఆనందంగా ఉంది. పనిలో పనిగా త్రివిక్రమ్ (Trivikram) ఫ్యాన్స్‌కి కూడా అంతే ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆ ఇద్దరి వారసులు కలసి ఓ సినిమా చేస్తారు అని.
ఇద్దరూ ఇప్పటివరకు సినిమాల్లోకి అధికారికంగా రాలేదు. త్రివిక్రమ్ తనయుడు రిషి ప్రస్తుతం సహాయ దర్శకుడిగా టాలీవుడ్ స్టార్ దర్శకుల దగ్గర పని చేస్తున్నారు. మరోవైపు అకిరా నందన్ వైజాగ్‌లో ప్రముఖ నటన శిక్షకుడు సత్యానంద్ దగ్గర నటనలో శిక్షణ తీసుకుంటున్నాడు అని సమాచారం. యాక్షన్ విభాగంలో ఇప్పటికే పూర్తి సంసిద్ధుడు అయి ఉన్నాడు. ఇద్దరూ ఒకేసారి సినిమాల్లోకి రావడానికి రెడీ అవుతుండటంతో ఇద్దరూ కలసి తొలి సినిమా కోసం రెడీ అవుతున్నారు అని అంటున్నారు.
అంటే ఇద్దరూ కలసి ఒకేసారి ఇండస్ట్రీలోకి వస్తారు అని. అంటే రిషి దర్శకత్వంలో అకిరా నందన్ డెబ్యూ ఇస్తాడు అని అంటున్నారు. దీంతో కొత్త దర్శకుడి సినిమాతో తొలి సినిమానా? అనే డౌట్ కొంతమంది అభిమానుల్లో ఉంది. అయితే వాళ్లు రిషి వెనుక త్రివిక్రమ్ ఉంటారని మరచిపోద్దు. అలాగే ప్రస్తుతం రిషి ఎక్కడ పని చేస్తున్నారు అనే విషయంలో కూడా ఓ అవగాహన ఉండాలి.
గత కొన్ని రోజులుగా ‘కింగ్‌డమ్’ (Kingdom) సినిమా కోసం గౌతమ్ తిన్ననూరి (Gowtam Tinnanuri) దగ్గర డైరక్షన్ టీమ్‌లో పని చేశారు. ఇప్పుడు ‘స్పిరిట్’ (Spirit) సినిమా కోసం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) టీమ్‌లో చేరారు అని సమాచారం. అంటే యాక్షన్ సినిమాల దర్శకుల దగ్గరే వర్క్ చేస్తున్నారు. కాబట్టి పుకార్లు నిజమైతే అకిరాతో తొలి సినిమా చేస్తే అది పక్కాగా యాక్షన్ సినిమానే అవుతుంది.