చంద్రబాబు నాయుడు అరెస్ట్ కావడంతో సినిమా ఇండస్ట్రీ నుంచి చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా ఆయనకు మద్దతు లభిస్తుందని అందరూ భావించారు అయితే కొంతమంది తప్ప మిగిలిన ఎవరూ కూడా చంద్రబాబు నాయుడు అరెస్టు గురించి మాట్లాడిన దాఖలాలు కూడా లేవు ఇక నిర్మాత సురేష్ బాబు అయితే ఇది ఇండస్ట్రీకి సంబంధించిన సమస్య కాదు అంటూ సూటిగా సమాధానం చెప్పేశారు. ఇలా ఇండస్ట్రీ నుంచి చంద్రబాబు నాయుడుకు మద్దతు రాకపోవడం గురించి తాజాగా పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీ మీద ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో వాళ్ళు ఈ విషయం గురించి మాట్లాడటానికి భయపడుతున్నారు. రాజకీయాలకు సంబంధించి సినిమా ఇండస్ట్రీలో డిఫరెంట్ గ్రూప్స్ ఉంటాయి.. ఇలాంటి గ్రూప్స్ ఇప్పుడు మాత్రమే కాదు గతంలో మేం ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు అలాగే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి ఉన్నాయని పవన్ కళ్యాణ్ తెలిపారు.
ఇప్పుడు వైసీపీకి కూడా ఉంది. నాకు సపోర్ట్ ఉందని కూడా నేను గట్టిగా చెప్పలేను. అసలు ఈ విషయంపై నేనెప్పుడు దృష్టి కూడా పెట్టలేదు. సినిమా ఇండస్ట్రీ అనేది ఒక అద్భుతమైన ఇండస్ట్రీ ఇది పొలిటికల్ ఇండస్ట్రీ మాదిరి కాదని, ఇక్కడ 24 శాఖలలో పనిచేసే కళాకారులు ఉంటారు. కనుక వారు పొలిటికల్ హీట్ ను డైరెక్ట్ గా తీసుకోలేరని చెప్పారు. ఇండస్ట్రీలో ఉన్నవారికి 100 సమస్యలు ఉంటాయి అందుకే వారు మరి రాజకీయాల గురించి కూడా పట్టించుకోరు.
ఇక ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో చాలామంది చంద్రబాబు నాయుడుకి మద్దతు తెలపడానికి భయపడుతున్నారని తెలిపారు. మొన్న రజనీకాంత్ గారు చంద్రబాబు గురించి మంచిగా మాట్లాడితే ఆయనని తిట్టకూడని తిట్లు అన్నీ కూడా తిట్టారు. ఇండస్ట్రీలో ఉన్నవారు అలాంటి వారి నోట్లో పడాలని ఎవరు అనుకోరు నేనంటే రాజకీయాలలోకి వచ్చాను మొండిగా వ్యవహరిస్తున్నానని తెలిపారు. ఒకవేళ నేను రాజకీయాలలోకి రాకపోయి ఉంటే నేను కూడా మాట్లాడకపోయి ఉండేవాడినేమో అంటూ పవన్ (Pawan Kalyan) చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.