Pawan Kalyan: బన్నీపై పవన్ కి కూడా కోపం ఉందా?
- August 8, 2024 / 07:48 PM ISTByFilmy Focus
మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి మధ్య కొంత గ్యాప్ ఏర్పడింది అని అందరికీ ఓ క్లారిటీ వచ్చేసింది. ఏపీ ఎన్నికల టైంలో అల్లు అర్జున్ (Allu Arjun) .. జనసేన పార్టీని పక్కన పెట్టి, నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన శిల్పా రవి తరఫున ప్రచారం చేసి రావడం, ఆ తర్వాత నాగబాబు (Naga Babu) పరోక్షంగా అల్లు అర్జున్ ను ఉద్దేశించి ఓ ట్వీట్ వేయడం.. ఆ తర్వాత జరిగిన రచ్చ అందరికీ తెలిసిందే.
Pawan Kalyan:

అన్నీ ఎలా ఉన్నా.. ఇటీవల బన్నీ వాస్ కూడా పరోక్షంగా అల్లు అర్జున్ కి మెగా ఫ్యామిలీకి గ్యాప్ ఉన్నట్టు కన్ఫర్మ్ చేశాడు. సో వీటన్నిటినీ ఆధారం చేసుకుని మెగా అభిమానులు అల్లు అర్జున్ ని ట్రోల్ చేస్తున్న సందర్భాలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇదిలా ఉంటే.. ఇలాంటి గొడవల్లోకి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఇన్వాల్వ్ కారు. అసలు అతను ఎలాంటి విషయాన్ని పెద్ద సీరియస్ గా తీసుకోడు.

అయితే అల్లు అర్జున్ విషయంలో పవన్ కూడా హర్ట్ అయ్యాడేమో అనే డౌట్ వస్తుంది. ఎందుకంటే.. డిప్యూటీ సీఎంగా ఓ కార్యక్రమానికి హాజరైన పవన్ కళ్యాణ్.. బన్నీ సినిమాని అడ్డం పెట్టుకుని సెటైర్లు వేశాడు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ” ఒకప్పుడు అంటే 40 ఏళ్ల కిందట హీరో అంటే అడవిని కాపాడేవాడు.

కానీ ఇప్పుడు హీరో అంటే గొడ్డలి పట్టుకుని చెట్లను నరికి స్మగ్లింగ్ చేస్తున్నాడు. అదే హీరోయిజం అని ప్రేక్షకులు కూడా భావిస్తున్నారు” అంటూ పుష్ప (Pushpa 2) సినిమాని అడ్డం పెట్టుకుని అల్లు అర్జున్ పై సెటైర్లు వేశాడు. తాను కూడా సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తే అయినప్పటికీ, అలాంటి సన్నివేశాల్లో నటించడం కష్టంగా ఉంటుందని పవన్ ఈ సందర్భంగా కామెంట్లు చేయడం గమనార్హం.
#transform @PawanKalyan on movies pic.twitter.com/9BHAREzse4
— devipriya (@sairaaj44) August 8, 2024
















