అక్కినేని నాగార్జున (Nagarjuna) సీనియర్ స్టార్ హీరోల్లో ఒకరు. కెరీర్ ప్రారంభం నుండి ఈయన స్టార్ హీరో ఇమేజ్ కోసం పరితపించలేదు. ఏదో కొత్తగా చేయాలనే ఉద్దేశంతో అడుగులు వేశారు. అప్పటికే చిరంజీవి (Chiranjeevi), బాలకృష్ణ (Nandamuri Balakrishna) వంటి స్టార్ హీరోలు ఉన్నారు. అక్కినేని నాగేశ్వరరావు (Akkineni Nageswara Rao) గారి లెజనీ ముందుకు తీసుకువెళ్లాలి అనే ఉద్దేశంతో ఆయన విభిన్న కథా చిత్రాలు చేసేవారు. అయితే వాటిని ప్రేక్షకులు ఆదరించడం కూడా జరిగింది. అందుకే నాగార్జున స్టార్ అయ్యారు.
Pawan Kalyan, Nagarjuna:
‘మజ్ను’ ‘గీతాంజలి’ ‘నిన్నే పెళ్ళాడతా’ (Ninne Pelladata) ‘హలో బ్రదర్’ (Hello Brother) వంటి ఎన్నో క్లాసిక్స్ ను అందించారు. మీరు కరెక్ట్ గా గమనిస్తే.. ఈ సినిమాల్లో ఒక దానికి ఇంకోటి సంబంధం లేదు. నాగార్జున కెరీర్లో ఇండస్ట్రీ హిట్ సినిమాగా నిలిచిన ‘శివ’ (Siva) అయితే.. ఇండియన్ సినిమాకి కొత్త హీరోయిజాన్ని పరిచయం చేసింది. అలాంటి నాగార్జున ఇప్పుడు హిట్ కొట్టడానికి,ముఖ్యంగా జనాలని తన సినిమాలకి థియేటర్లకు రప్పించడానికి చాలా కష్టపడుతున్నారు.
నాగార్జున గురించి ఇంకో విషయం చెప్పుకోవాలంటే.. ఓ సందర్భంలో ఆయన సినిమా ముందు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సినిమా కూడా చతికిలపడిపోయింది. వివరాల్లోకి వెళితే.. 2004 డిసెంబర్ 23న ‘మాస్’ (Mass) సినిమా రిలీజ్ అయ్యింది. రాఘవ లారెన్స్ (Raghava Lawrence) ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. వాస్తవానికి విడుదలకి ముందు ఈ సినిమాపై అంచనాలే లేవు. అయినప్పటికీ ఈ సినిమా ఏకంగా రూ.36 కోట్ల వరకు గ్రాస్ ను కలెక్ట్ చేసింది.
మరోపక్క 2005 జనవరి 6న పవన్ కళ్యాణ్ ‘బాలు’ (Balu) సినిమా రిలీజ్ అయ్యింది. కరుణాకరన్ (A. Karunakaran) ఈ చిత్రానికి దర్శకుడు. ‘తొలిప్రేమ’ (Tholi Prema) కాంబో కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ ఈ సినిమా అంచనాలు అందుకోలేదు. ‘మాస్’ రిలీజ్ అయిన 2 వారాల తర్వాత రిలీజ్ అయినా.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద క్యాష్ చేసుకోలేకపోయింది. ఫుల్ రన్లో ఈ సినిమా కేవలం రూ.16 కోట్ల గ్రాస్ ను మాత్రమే కలెక్ట్ చేసి జస్ట్ యావరేజ్ సినిమాగా నిలిచింది. నేటితో ‘బాలు’ సినిమా రిలీజ్ అయ్యి 20 ఏళ్ళు పూర్తి కావస్తోంది.