ప్రస్తుతం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సినిమాల సంగతి ఎలా ఉందంటే, లైన్ లో ఉండేలా ఉంటాయి కానీ మళ్ళీ డౌట్ తెచ్చేలా మారుతున్నాయి. తాజా ఉదాహరణే సురేందర్ రెడ్డి (Surender Reddy) డైరెక్షన్‌లో రూపొందాల్సిన యాక్షన్ డ్రామా ప్రాజెక్ట్. ‘పవన్ – సురీ కాంబో’ అనౌన్సమెంట్ వచ్చినప్పుడు ఒక్క పోస్టర్‌తోనే అద్భుతమైన హైప్ ఏర్పడింది. కానీ దానికి మించిన ఎలాంటి డెవలప్‌మెంట్ జరగకపోవడం, ఇప్పుడు ఈ సినిమా జరిగే అవకాశాలపై బిగ్ డౌట్ తలెత్తిస్తోంది.
ఈ ప్రాజెక్ట్ ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామ్ తల్లూరి (Ram Talluri) నిర్మించాల్సి ఉంది. పవన్‌కు అడ్వాన్స్ కూడా ఇచ్చినట్లు నిర్మాత స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయం తెలిసిందే. అయితే నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా పవన్ డేట్స్ ఇచ్చే స్థితిలో లేరు. హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu), OG (OG Movie) , భగత్ సింగ్ (Ustaad Bhagat Singh) సినిమాలు ఇంకా కంప్లీట్ కాలేదు. అలాగే పొలిటికల్ కమిట్మెంట్స్ మరింతగా పెరగడంతో, పవన్ సినిమాల మీద ఆయనకే స్పష్టత లేకుండా పోయింది.
ఇక మేకర్స్ వైపు చూస్తే, పూర్తిగా చేతులు ఎత్తేయకుండా… కథను మార్చకుండా మరో హీరోతో సినిమాను తీసుకెళ్లాలా? అన్న ఆలోచనలో ఉన్నారట. దర్శకుడు సురేందర్ రెడ్డి ఇప్పటికే కొత్త ప్రాజెక్ట్ రేసర్ కోసం స్క్రిప్ట్ వర్క్ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. అంటే పవన్ కోసం సెట్ చేసిన ప్రాజెక్ట్ ఫ్రెష్‌గా కొత్త హీరోతో చేసే అవకాశం ఉంది. అయితే కథలోని మాస్ యాంగిల్, పవన్ ఇమేజ్‌కు సూటవడం వల్ల కొత్త హీరో ఎంపికపై జాగ్రత్తగా ఆలోచిస్తున్నారు.
అయితే అసలు ఫోకస్ ఇప్పుడు అడ్వాన్స్‌పై పడింది. పవన్ డేట్స్ కేటాయించకపోతే, మరొక ప్రాజెక్ట్ చేస్తారా లేదా అడ్వాన్స్ వెనక్కి ఇస్తారా అన్నది కాలమే నిర్ణయించాలి. ప్రస్తుతం పవన్ రాజకీయాల్లో బిజీగా ఉండడం వల్ల నిర్మాతలు కొంత కొంత తెలివిగా వ్యవహరించాల్సిన పరిస్థితి. బాలకృష్ణ (Nandamuri Balakrishna) లాంటి సీనియర్లు అయితే ఒకటి చేస్తే మరోటి హ్యాండిల్ చేయగలుగుతున్నా, పవన్ విషయంలో మాత్రం అలాంటి బ్యాలెన్స్ లేదన్నది ఇండస్ట్రీ వర్గాల అభిప్రాయం. మరి పవన్ రామ్ తల్లురి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.