పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్ లతో కెరీర్ పరంగా చాలా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. పవన్ సినిమాలకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతుండటం గమనార్హం. పవన్ రెమ్యునరేషన్ సైతం భారీ రేంజ్ లో ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. మరోవైపు పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో భాగంగా చేస్తున్న విమర్శలు సైతం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాలు విడుదలైన సమయంలో టికెట్ రేట్లను తగ్గించడం వల్ల ఈ సినిమా హక్కులను కొనుగోలు చేసిన ఏపీ బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు భారీగా నష్టపోయారు.
టికెట్ రేట్లు మరీ తక్కువగా ఉండటం సినిమా కలెక్షన్లపై తీవ్రస్థాయిలో ప్రభావం చూపింది. ఈ రెండు సినిమాలకు ఏపీలో అదనపు షోలకు కూడా అనుమతులు లభించలేదు. ఈ సినిమాల గురించి తాజాగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ షాకింగ్ కామెంట్లు చేయగా ఆ కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ రెండు సినిమాలు విడుదలైన సమయంలో ఏపీలో టికెట్ రేట్లు 10 రూపాయలకు తగ్గించారని పవన్ అన్నారు.
10 రూపాయల టికెట్ ధరతో పెట్టుబడి ఎప్పటికి తిరిగి వస్తుందని (Pawan Kalyan) పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఈ రెండు సినిమాలు హిట్టైనా నిర్మాతలకు నష్టాలను మిగిల్చాయని పవన్ అన్నారు. ఈ రెండు సినిమాలకు 30 కోట్ల రూపాయల నష్టం రాగా ఆ నష్టం నేనే భరించానని పవన్ చెప్పుకొచ్చారు. పవన్ వెల్లడించిన ఈ విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.
తన సినిమాల వల్ల నిర్మాతలు నష్టపోతే ఆదుకునే విషయంలో పవన్ కళ్యాణ్ ముందువరసలో ఉంటారు. పవన్ సినిమాలపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండగా ఈ సినిమాలకు ఏ రేంజ్ లో కలెక్షన్లు వస్తాయో చూడాల్సి ఉంది.