హీరో వర్షిప్ అనేది మన తెలుగు రాష్ట్రాల కంటే తమిళనాట ఎక్కువ. ఇక రజనీకాంత్ ను ఇష్టపడనివారు ఉంటారా చెప్పండి. ఆయన్ని అభిమానిస్తారు అనేకంటే.. కొలుస్తారు అని చెప్పడం సబబేమో. అలా రజనీని చిన్నప్పట్నుంచి కొలిచిన ఓ కుర్రాడు దర్శకుడిగా మారి.. తాను కొలిచిన వ్యక్తికి నిర్దేశించే అవకాశం అందుకుంటే ఎలా ఉంటుందో.. పెట్ట సినిమా చూస్తే అర్ధమైపోతుంది. రజనీకాంత్ కి వీరాభిమాని అయిన కార్తీక్ సుబ్బరాజు.. రజనీని తన అభిమానులు ఎలా చూడాలి అనుకుంటున్నారో అలాగే చూపించాడు. అందుకే పెట్ట ట్రైలర్ చూసిన రజనీ అభిమానులందరూ “ఇది కదా మాకు కావాల్సిన ఎమోషన్” అంటూ కాలర్ ఎగరేస్తున్నారు.
అప్పట్లో పవన్ కళ్యాణ్ ను.. పీకేకి విశేషమైన అభిమాని అయిన హరీష్ శంకర్ దర్శకత్వం వచించినప్పుడు అవుట్ పుట్ ఎలా వచ్చిందో తెలిసిందే. అదే “గబ్బర్ సింగ్”. ఆ సినిమా తర్వాత కానీ.. ముందు కానీ పవన్ కళ్యాణ్ కు ఆరేంజ్ ఎలివేషన్ & యాటిట్యూడ్ ఎవరూ ఇవ్వలేకపోయారు. అందుకే హరీష్ శంకర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు మోస్ట్ ఫేవరెట్ డైరెక్టర్ అయిపోయాడు. సో, ఇప్పుడు పెట్ట విషయంలోనూ అదే మ్యాజిక్ రిపీట్ కానుంది. సొ, ఆ మ్యాజిక్ ను ఎంజాయ్ చేయాలంటే జనవరి 10 వరకు వెయిట్ చేయాల్సిందే.