ఏప్రిల్ 27న సూర్య (Suriya) హీరోగా తెరకెక్కిన ‘రెట్రో’ (Retro) ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. హైదరాబాద్, జె.ఆర్.సి కన్వెన్షన్ వేదికగా జరిగిన ఈ ఈవెంట్ కు గెస్ట్ గా వచ్చాడు విజయ్ దేవరకొండ(Vijay Devarakonda). ఈ క్రమంలో అతను స్పీచ్ ఇస్తూ కశ్మీర్, పహల్గామ్ ఉగ్రవాద దాడి గురించి స్పందించాడు. ‘ఈ టెర్రరిస్ట్ నా కొడుకులకి సరైన విద్య అందించి ఉంటే ఇలాంటి ఘోరాలకు పాల్పడేవారు కాదేమో అనీప్సితుంది. 500 ఏళ్ళ క్రితం ఆదివాసీయులు కొట్టుకున్నట్టు గొడవలకి దిగుతారు’ అంటూ విజయ్ దేవరకొండ అగ్రెసివ్ గా చెప్పడం జరిగింది.
అయితే ఇక్కడ ట్రైబల్స్ గురించి తప్పుగా మాట్లాడాలి అనేది అతను ఉద్దేశం కాదు. కానీ ఉగ్రవాదులను గిరిజనులతో పోల్చడం పై మన్యం జిల్లా ఆదివాసీ JAC నేతలు మండిపడ్డారు. విజయ్ పై విమర్శలు గుప్పించాయి. అయితే విజయ్ దేవరకొండ నుండి ఎటువంటి రెస్పాన్స్ రాకపోవడంతో అతని పై పోలీస్ కంప్లైంట్ నమోదైనట్టు సమాచారం. లాల్ చౌహాన్ అనే లాయర్ హైదరాబాద్ అమీర్ పేట్ సమీపంలో ఉన్న ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్లో విజయ్ దేవరకొండపై ఫిర్యాదు చేశారు.
అయితే విజయ్ పై కేసు పెట్టే ముందు పోలీసులు న్యాయ సలహా కోసం సమయం అడిగినట్టు సమాచారం. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. మరోపక్క విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ (Kingdom) అనే సినిమాలో నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు. మే 30న ఈ సినిమా రిలీజ్ అవుతుందని టీం ప్రకటించింది.