నాగ చైతన్య హీరోగా వచ్చిన ‘ఒక లైలా కోసం’ చిత్రంతో హీరోయిన్ గా పరిచయమయ్యింది పూజా హెగ్దే. ఈ చిత్రం యావరేజ్ గా నిలిచినప్పటికీ పూజా.. నటన, అందంతో యూత్ ని ఆకట్టుకుంది. ఆ వెంటనే వరుణ్ తేజ్ … మొదటి చిత్రమైన ‘ముకుంద’ చిత్రంలో ఛాన్స్ కొట్టేసింది. ఈ చిత్రంతో ఫ్యామిలీ ఆడియన్స్ కూడా దగరయ్యిందని చెప్పొచ్చు. చూడ్డానికి పొడుగ్గా ఉండడం వలన అనుకుంటాను… బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ‘మహోంజదారో’ మూవీలో కూడా ఛాన్స్ కొట్టేసి… బాలీవుడ్ కి చెక్కేసింది. ఇంకేంటి ఈ అమ్మడు బాలీవుడ్ లో సెటిల్ అయిపోవడం ఖాయమనుకున్నారంతా.. అయితే ఆ చిత్రం ఘోర డిజాస్టర్ గా నిలవడంతో పూజకి పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో మళ్ళీ టాలీవుడ్ కి రిటర్న్ వచ్చేసి… అల్లు అర్జున్ సరసన ‘దువ్వాడ జగన్నాధం- డీజె’ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. మొదటి రెండు చిత్రాల్లోనూ… ఎక్కడా ‘గ్లామర్ డోస్’ లేకుండా చాలా పద్ధతిగా కనిపించడం వలనే ఆఫర్లు రావట్లేదనుకుందేమో… ‘డీజె’ చిత్రంలో మాత్రం ఓ రేంజ్లో గ్లామర్ షో చేసి అటు యూత్ ని.. ఇటు దర్శక నిర్మాతల్ని క్యూలు కట్టేలా చేసుకుంది. నిజానికి ‘దువ్వాడ జగన్నాధం- డీజె’ చిత్రం ఆశించిన స్థాయిలో హిట్టవ్వకపోయినప్పటికీ.. పూజా కెరీర్ కి మాత్రం ఈ చిత్రం బాగా హెల్ప్ అయ్యిందని చెప్పుకోవచ్చు.
ఇక ఆ వెంటనే బెల్లంకొండ సరసన ‘సాక్ష్యం’, ఎన్టీఆర్ సరసన ‘అరవింద సమెత’ చిత్రాలతో పాటు ‘రంగస్థలం’ చిత్రంలో ‘జిగేల్ రాణి’ అనే ఐటెం సాంగ్ తో అలరించింది. ఇక ప్రస్తుతం సూపర్ స్టార్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మహేష్ బాబు 25వ చిత్రం ‘మహర్షి’ లో హీరోయిన్ గా నటిస్తుంది పూజా. ఏప్రిల్ 25 న ఈ చిత్రం విడుదల కాబోతుంది. అయితే ‘మహర్షి’ చిత్రం నుండీ ఇప్పటి వరకూ పూజా హెగ్డే పిక్ ఒకటి కూడా బయటకు రాలేదు. ఈ చిత్రానికి గానూ పూజా హెగ్డే 1.75 కోట్ల రెమ్యూనరేషన్ ను తీసుకుందట. ఇప్పటి వరకూ పూజా కెరీర్లో ఒక్క భారీ బ్లాక్ బస్టర్ కూడా లేదు. ‘అరవింద సమేత’ చిత్రం పర్వాలేదనిపించినా భారీ హిట్టయితే కాలేకపోయింది. అయినప్పటికీ ‘మహర్షి’ కోసం పూజా హెగ్డేకు ఏకంగా 1.75 కోట్ల పారితోషికం ఎందుకు ఇస్తున్నట్టు.? అనే సందేహం కలుగక మానదు. అయితే ‘మహర్షి’ చిత్రంకోసం పూజను ఎక్కువ డేట్లు కోరడంతో… ఇంత డిమాండ్ చేసిందని తెలుస్తుంది. మరి ఈ చిత్రం పూజకు ఎలాంటి హిట్ ఇస్తుందో చూడాలి మరి..!