‘బుట్టబొమ్మ’ పూజా హెగ్డే (Pooja Hegde) గత ఏడాదిన్నరగా వెండితెరపై పెద్దగా కనిపించడం లేదు. ‘కిసీకా భాయ్ కిసీకా జాన్’ (Kisi Ka Bhai Kisi Ki Jaan) తర్వాత పూజా నటించిన సినిమా విడుదల కాలేదు. ఇక ఫైనల్ గా రోషన్ ఆండ్రూస్ (Rosshan Andrrews) దర్శకత్వంలో షాహిద్ కపూర్ (Shahid Kapoor) సరసన నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘దేవా’తో (Deva) ఆమె మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా జనవరి 31న విడుదల కానుంది. అయితే ఇటీవల సెన్సార్ బోర్డు ముందుకు వెళ్లిన ఈ సినిమాకు U/A సర్టిఫికేట్ లభించింది.
Pooja Hegde
అయితే, సెన్సార్ కొన్ని కీలక సన్నివేశాలకు కత్తెర వేసింది. ముఖ్యంగా, సినిమాలోని షాహిద్ కపూర్-పూజా హెగ్డే మధ్య లిప్ లాక్ సీన్ తీవ్ర అభ్యంతరానికి గురైందట. 6 సెకన్ల ఈ సన్నివేశం మరింత ఘాడంగా ఉందని భావించిన సెన్సార్ బోర్డు, దానిని పూర్తిగా కట్ చేయాలని నిర్ణయించింది. సాధారణంగా లిప్ లాక్ సీన్లకు సెన్సార్ ఇంతగా స్పందించడం అరుదు. కానీ, ఈ సన్నివేశం యువతపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని సెన్సార్ బోర్డు పేర్కొంది.
లిప్ లాక్ సీన్ మాత్రమే కాకుండా, మరికొన్ని రొమాంటిక్ సన్నివేశాలు, అసభ్య పదజాలం ఉన్న డైలాగ్స్ కూడా సెన్సార్ చొరవతో తొలగించబడ్డాయి. దీంతో, సినిమా మొత్తం 156 నిమిషాల 59 సెకన్ల నిడివికి కుదించారు. పూజా హెగ్డేకు ఈ చిత్రం చాలా కీలకమని చెప్పొచ్చు. తనకు ఇటీవల హిట్స్ లేకపోవడంతో ‘దేవా’ సినిమాపై పూజా చాలా ఆశలు పెట్టుకుంది.
ఈ సినిమాలో షాహిద్ కపూర్‌తో పూజా రొమాంటిక్ కెమిస్ట్రీ హైలైట్ కానుందని ట్రైలర్ లోనే స్పష్టమైంది. ఇక ఈ సెన్సార్ మార్పులు సినిమాపై ఎటువంటి ప్రభావం చూపిస్తాయో, పూజా కమ్‌బ్యాక్‌కు ఈ సినిమా ఎంతవరకు కలిసొస్తుందో చూడాలి.