Thandel Trailer Review: ఓనర్ కాదు లీడర్.. మాస్ ఫీస్ట్ అంతే..!
- January 28, 2025 / 07:29 PM ISTByPhani Kumar
అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya) హీరోగా సాయి పల్లవి (Sai Pallavi) హీరోయిన్ గా ‘తండేల్’ (Thandel) సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ‘లవ్ స్టోరీ’ (Love Story) వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత వీరి కాంబినేషన్లో రూపొందిన మూవీ ఇది. ‘కార్తికేయ 2’ (Karthikeya 2) తో పాన్ ఇండియా హిట్ కొట్టిన చందూ మొండేటి (Chandoo Mondeti) ఈ చిత్రానికి దర్శకుడు. వరుస సక్సెస్లలో ఉన్న బన్నీ వాస్ (Bunny Vasu) నిర్మాత. నాగ చైతన్య, బన్నీ వాస్ కాంబినేషన్లో కూడా ‘100% లవ్’ (100% Love) అనే సినిమా వచ్చింది.
Thandel Trailer Review

దీంతో ‘తండేల్’ పై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ఫిబ్రవరి 7న ‘తండేల్’ రిలీజ్ కానుంది. ప్రమోషన్లో భాగంగా విడుదల చేసిన ‘బుజ్జి తల్లి’ ‘హైలెస్సో’ వంటి పాటలు చార్ట్ బస్టర్స్ అయ్యాయి. తాజాగా ట్రైలర్ ను కూడా వదిలారు. ‘తండేల్’ ట్రైలర్ విషయానికి వస్తే.. ఇది 2:22 నిమిషాల నిడివి కలిగి ఉంది.సాయి పల్లవి వాయిస్ ఓవర్ తో ట్రైలర్ మొదలైంది.

తర్వాత నాగ చైతన్య మాస్ లుక్లో ఎంట్రీ అభిమానులను ఆకట్టుకునే విధంగా ఉంది. సాయి పల్లవి లుక్స్ చాలా నాచురల్ గా ఉన్నాయి. అయినప్పటికీ ఎక్కువగా నాగ చైతన్యనే ట్రైలర్ కి హైలెట్ అయ్యాడు అని చెప్పాలి. ఈ ట్రైలర్లో కథ చాలా వరకు చెప్పేశారు. హీరో గ్యాంగ్ పాకిస్థాన్ సైన్యంకి చిక్కిన తర్వాత ..

ఏం జరిగింది? చివరికి వాళ్ళు ఎలా బయటపడ్డారు అనేది మిగిలిన సినిమా అని అంటున్నారు. దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ట్రైలర్ కి హైలెట్ అయ్యింది. ఎక్కువగా బుజ్జి తల్లి సాంగ్లో మ్యూజిక్ నే వాడారు. ట్రైలర్ ను మీరు కూడా ఒక లుక్కేయండి :













