‘దసరా’తో (Dasara) ప్రేక్షకుల మనసులు దోచుకున్న నాని (Nani) – శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) కాంబినేషన్ ఇప్పుడు మరోసారి కలసి ‘ది ప్యారడైజ్’ (The Paradise) అనే పాన్ వరల్డ్ యాక్షన్ డ్రామాతో రంగంలోకి దిగుతోంది. 1980ల కాలంలో నడిచే ఈ కథకు SLV సినిమాస్ భారీ బడ్జెట్ కేటాయించగా, మ్యూజిక్ డైరెక్టర్‌గా అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) సైన్ చేశాడు. సినిమా పూర్తి స్థాయిలో పూర్వ ప్రణాళిక దశలో ఉన్నప్పటికీ, ఇందులో ఉండబోయే విలన్ పాత్రపై ప్రస్తుతం ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్ నడుస్తోంది.
లేటెస్ట్ బజ్ ప్రకారం బాలీవుడ్ యాక్టర్ రాఘవ్ జుయల్(Raghav Juyal) ‘ది ప్యారడైజ్’ సినిమాలో ప్రధాన విలన్‌గా నటించబోతున్నాడట. ఇటీవల హిందీలో విడుదలైన థ్రిల్లర్ యాక్షన్ ఫిల్మ్ ‘కిల్’లో రాఘవ్ పోషించిన సైకో పాత్రకు మంచి గుర్తింపు లభించింది. ‘స్లో మోషన్ కింగ్’గా పేరుగాంచిన ఈ నటుడి యాక్టింగ్‌కి తిరుగులేదని క్రిటిక్స్ ప్రశంసించారు. ఇప్పుడు అలాంటి ఇంటెన్స్ పాత్రతో నానిని ఎదుర్కొనబోతుండటంతో ‘ది ప్యారడైజ్’ సినిమాపై అంచనాలు రెట్టింపు అవుతున్నాయి.
ఈ సినిమాతో సంబంధించి ఇప్పటికే అనిరుధ్ మ్యూజిక్ బీట్స్‌పై భారీ హైప్ ఉంది. గతంలో ‘జైలర్’(Jailer), ‘లియో’ (LEO) , ‘విక్రమ్’ (Vikram) వంటి సినిమాలకు మ్యూజిక్ ఇచ్చిన అనిరుధ్, ఈసారి నానితో కలిసి మరింత మాస్ కంటెంట్ అందించనున్నాడు. ఇక హీరోయిన్‌గా కాయదు లోహర్ ఎంపికైనట్టు సమాచారం. అయితే ఆమె కాస్టింగ్ పై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. ఒకవేళ ఈ కాంబినేషన్ కన్ఫర్మ్ అయితే, ఇది కొత్త ఫ్రెష్ యాంగిల్‌కి మారుతుంది.
టెక్నికల్ టీమ్ విషయానికొస్తే, సినిమాటోగ్రాఫర్ జీకే విష్ణు వ్యక్తిగత కారణాలతో ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడం వల్ల ఇప్పుడు కొత్త DOP కోసం టీమ్ వెతుకుతున్నట్టు సమాచారం. ఈ సినిమాకి విజువల్స్ చాలా కీలకం కావడంతో, కొత్త సినిమాటోగ్రాఫర్ ఎవరవుతారో అనేది ఆసక్తిగా మారింది. శ్రీకాంత్ ఓదెల మాత్రం సెట్ డిజైన్, నేరేటివ్ ప్రెజెంటేషన్ విషయంలో పూర్తి పర్వేక్షణ చేస్తూ ముందుకు వెళ్తున్నాడు. ‘ది ప్యారడైజ్’ మూవీ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుండగా, 2026 సమ్మర్‌కి రిలీజ్ చేయాలన్నది మేకర్స్ లక్ష్యం.