గత వారం రోజులుగా గురిస్తున్న భారీ వర్షాలకు, అలాగే పోటెత్తుతున్న వరదలకు తెలుగు రాష్ట్రాలు విలవిలలాడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు అన్నీ జలమయమయ్యాయి. వాహనాలు కొట్టుకుపోతున్న పరిస్థితి. రైతులు తీవ్రంగా నష్టపోయారు. లక్షలాది ఎకరాల్లోని పంట నీటిపాలైంది. చాలా ప్రాంతాల్లో జనాలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఒక్క తెలంగాణలోనే వరదల కారణంగా ఇప్పటి వరకు 17 మంది చనిపోయినట్లు సమాచారం. ఆంధ్రాలో ఈ లెక్క ఇంకా ఎక్కువగానే ఉంది అని వినికిడి.
Prabhas
ఇక చాలా మంది జనాలు తినడానికి తిండి లేక, తాగడానికి సరైన నీళ్లు లేక చాలా బాధలు పడుతున్నారు. వారిని ఆదుకునేందుకు తెలుగు సినీ పరిశ్రమ ముందుకొచ్చింది. ఎటువంటి విపత్తు తలెత్తినా ముందుగా స్పందించేది సినీ పరిశ్రమే అని మరోసారి ప్రూవ్ అయ్యింది. వరద బాధితులను ఆదుకునేందుకు ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) , మహేష్ బాబు (Mahesh Babu) , అల్లు అర్జున్ (Allu Arjun), ఎన్టీఆర్ (Jr NTR) వంటి స్టార్ హీరోలు తన వంతు సాయంగా రెండు రాష్ట్రాలకు కలిపి రూ.1 కోటి విరాళంగా ప్రకటించారు.
తాజాగా ప్రభాస్ పెద్ద మనసు చేసుకొని, రూ.2 కోట్లు విరాళంగా ప్రకటించాడు. ఇందులో తెలంగాణకి కోటి, ఆంధ్రకి కోటిగా .. అతను విరాళంగా ఇవ్వడం జరిగింది. టాలీవుడ్ హీరోలందరికంటే ప్రభాస్ (Prabhas) ఎక్కువ విరాళం ఇవ్వడం అనేది ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ప్రభాస్ గొప్ప మనసు ఈ సందర్భంగా మరోసారి బయటపడింది. దీంతో సోషల్ మీడియాలో సైతం ప్రభాస్ పై ప్రశంసల వర్షం కురుస్తుంది. ‘ది మాన్ విత్ గోల్డెన్ హార్ట్’ అంటూ స్టైల్లో ప్రభాస్ ని ప్రశంసిస్తున్నారు నెటిజన్లు.
‘The man with golden heart’
Rebel Star’s Generous Donation of 2 Crores for Flood Relief! ❤️#Prabhas donates Rs. 1 crore each to the Andhra Pradesh and Telangana Chief Ministers’ Relief Funds to support and aid the ongoing flood relief efforts for victims.@AndhraPradeshCM… pic.twitter.com/HRRsJeLXCd