స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ పరంగా బిజీగా ఉంటూ సంచలన విజయాలను సొంతం చేసుకుంటున్నారు. కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD) మూవీ ఫుల్ రన్ లో 1100 కోట్ల రూపాయల కలెక్షన్ల మార్క్ ను క్రాస్ చేసే ఛాన్స్ అయితే ఉంది. మరోవైపు ప్రభాస్ రాజాసాబ్ (The Rajasaab) మూవీకి తన రెమ్యునరేషన్ తగ్గించుకుని పని చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వైరల్ అవుతున్న వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది.
రాజాసాబ్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిస్తే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పేరు మరోమారు పాన్ ఇండియా స్థాయిలో మారుమ్రోగుతుందని చెప్పడంలో సందేహం అక్కర్లేదు. అయితే ప్రభాస్ రేంజ్ కు రూ.200 కోట్లు ఇచ్చినా తక్కువేనని సోషల్ మీడియా వేదికగా జోరుగా చర్చ జరుగుతోంది. ప్రభాస్ సినిమాలు నార్త్ లోనే 300 కోట్ల రూపాయల రేంజ్ లో కలెక్షన్లను సాధిస్తున్న నేపథ్యంలో ఈ కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
ప్రభాస్ తన టాలెంట్ తో మార్కెట్ ను అంతకంతకూ పెంచుకుంటూ మ్యాజిక్ చేస్తున్నారని చెప్పవచ్చు. బాహుబలి1 (Baahubali) నుంచి కల్కి 2898 ఏడీ వరకు సినిమా సినిమాకు భిన్నమైన జానర్లను ఎంచుకుంటూ ఉండటం కూడా ప్రభాస్ సక్సెస్ సీక్రెట్ అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. స్టార్ హీరో ప్రభాస్ సినిమాలు నిర్మాతలకు మాత్రం ఊహించని రేంజ్ లో లాభాలను అందిస్తుండటం కొసమెరుపు.
స్టార్ హీరో ప్రభాస్ సరైన విధంగా అడుగులు వేస్తే ఆయన బాక్సాఫీస్ వద్ద సృష్టించే సంచలనాలు మామూలుగా ఉండవని చెప్పవచ్చు. కన్నప్ప (Kannappa), రాజాసాబ్ సైతం సక్సెస్ సాధిస్తే ప్రభాస్ మార్కెట్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది. ఐదేళ్ల క్రితం ప్రభాస్ బాహుబలి2 తో (Baahubali 2) క్రియేట్ చేసిన కొన్ని రికార్డులు ఇప్పటికీ బ్రేక్ అయ్యే పరిస్థితులు మాత్రం కనిపించడం లేదని చెప్పవచ్చు. ప్రభాస్ సాధించిన రికార్డులలో చాలా రికార్డులను ప్రభాస్ సినిమాలే చెరిపేయడం గమనార్హం.