తనని సార్ అని పిలవద్దని బాలీవుడ్ హీరోలకు చెప్పిన ప్రభాస్
- June 23, 2017 / 01:51 PM ISTByFilmy Focus
పార్టీలకు చాలా దూరంగా ఉండే ప్రభాస్.. ఈ మధ్య ముంబై లో నిర్మాత కరణ్ జోహార్ ఇచ్చిన పార్టీకి హాజరయ్యారు. బాహుబలి కంక్లూజన్ హిందీ వెర్షన్ ను దేశవ్యాప్తంగా ఆయనే పంపిణీ చేశారు. తెలుగు వెర్షన్ కంటే హిందీ వెర్షన్ ఎక్కువ లాభాలను తెచ్చి పెట్టింది. సో తన సంతోషం కోసం బాహుబలి చిత్ర బృందానికి కరణ్ పార్టీ ఇచ్చారు. ఆ పార్టీలో ప్రభాస్ ఫోటోలు రెండు రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఇప్పుడు ఆ పార్టీలో ప్రభాస్ చెప్పిన మాటలు బయటికి వచ్చాయి. బాలీవుడ్ యువ హీరోలైనా వరుణ్ ధావన్, అర్జున్ కపూర్ లు ప్రభాస్ ని సార్ అని గౌరవంగా పిలిచారంట.
దీంతో ప్రభాస్ అలా పిలవద్దని, తనకి ఇబ్బందిగా ఉందని, జస్ట్ ప్రభాస్ అని పిలిస్తే సరిపోతుందని వారికి చెప్పారంట. అయినా పేరెట్టి పిలవడానికి బాలీవుడ్ హీరోలు నిరాకరించారని ఓ జాతీయ పత్రిక ఈ రోజు వార్త ప్రచురించింది. బాహుబలిగా ప్రపంచ ప్రజలను అలరించిన వ్యక్తిని సార్ అని గౌరవించడం తమకిష్టమని వివరించినట్లు స్పష్టం చేసింది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.















