టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఒకే సమయంలో రెండు సినిమాలలో నటిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ప్రభాస్ ఒకే సమయంలో మూడు సినిమాలలో సైతం నటించడానికి ఓకే చెబుతున్నారు. అదే సమయంలో సినిమా సినిమాకు లుక్ విషయంలో వేరియేషన్ చూపిస్తూ ప్రభాస్ ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్నారు. ప్రభాస్ తాజాగా 10 కేజీలు తగ్గారని సమాచారం అందుతోంది. స్లిమ్ లుక్ లో ప్రభాస్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతుండగా ఆ ఫోటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.
కొంతమంది ప్రభాస్ అభిమానులు ఈ ఫోటోలను చూసి ఈ లుక్ ప్రభాస్ బెస్ట్ లుక్ అని కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ హను రాఘవపూడి (Hanu Raghavapudi) డైరెక్షన్ లో ఒక సినిమాలో, ప్రశాంత్ నీల్ (Prashanth Neel) డైరెక్షన్ లో సలార్2 (Salaar) సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలలో ఏ సినిమా కోసం ప్రభాస్ బరువు తగ్గారో తెలియాల్సి ఉంది. మరోవైపు ప్రభాస్ రాజాసాబ్ (The Rajasaab) సినిమా నుంచి త్వరలో ఫస్ట్ సింగిల్ విడుదల కానుందని సమాచారం అందుతోంది.
రాజాసాబ్ సినిమా నుంచి త్వరలో ఫస్ట్ సింగిల్ రిలీజ్ కానుందని తెలుస్తోంది. థమన్ (S.S.Thaman) ఈ సినిమాకు ఎలాంటి మ్యూజిక్ ఇచ్చారో తెలియాల్సి ఉంది. రాజాసాబ్ ప్రభాస్ రేంజ్ ను పెంచుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. మరోవైపు కల్కి సినిమా నుంచి రిలీజ్ డేట్ కు సంబంధించి క్లారిటీ ఇంకా రాలేదు. కల్కి (Kalki 2898 AD) సినిమా గురించి స్పష్టత కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. స్టార్ హీరో ప్రభాస్ సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి ఉండబోతున్నాయని తెలుస్తోంది.
ఆరు నెలలకు ఒక సినిమా రిలీజ్ అయ్యేలా ప్రభాస్ కెరీర్ ప్లానింగ్ ఉందని సమాచారం అందుతోంది. ప్రభాస్ తన ఫ్యాన్ ఫాలోయింగ్ తో ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నారు. స్టార్ హీరో ప్రభాస్ భారీ రేంజ్ లో పారితోషికం అందుకుంటున్నారు.