పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం విదేశాలలో ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఈయన గత కొద్ది రోజులుగా యూరప్ పర్యటనలో ఉన్నారు. అయితే వెకేషన్ కోసం వెళ్లలేదని మోకాలి సర్జరీ కోసం వెళ్లారు అనే విషయం మనకు తెలిసిందే .ఈ క్రమంలోనే ఈయన మరొక నెల రోజులపాటు అక్కడే ఉండబోతున్నట్లు సమాచారం. అక్టోబర్ చివరి వారంలో ఈయన తిరిగి ఇండియా చేరుకోబోతున్నారని తెలుస్తుంది. సర్జరీ తర్వాత వెంటనే ఇండియా రావాలనుకున్నటువంటి ప్రభాస్ వైద్యుల సలహా మేరకు మరొక నెల రోజులపాటు అక్కడే ఉండబోతున్నారు.
ఇక ప్రభాస్ (Prabhas) నటించిన సలార్ సినిమా సెప్టెంబర్ 28వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది అయితే కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది ఈ విషయం ముందే తెలిసినటువంటి ప్రభాస్ ముందుగానే యూరప్ వెళ్ళిపోయారు. ఇలా విదేశాలకు వెళ్లినటువంటి ప్రభాస్ మోకాలు సర్జరీ సక్సెస్ ఫుల్ అయిందని అయితే డాక్టర్లు విశ్రాంతి తీసుకోవాల్సిందే అని చెప్పడంతో నెలరోజుల పాటు విశ్రాంతి తీసుకోవడం వల్ల ఈయన ఎలాంటి సినిమా షూటింగ్లకు హాజరు కావడం లేదని తెలుస్తుంది.
అక్టోబర్ చివరి వారంలో ఇండియా చేరుకున్నటువంటి ప్రభాస్ నవంబర్ ఫస్ట్ వీక్ లో తిరిగి తన సినిమా షూటింగ్ పనులలో బిజీ కానున్నారు. గత కొంతకాలంగా ప్రభాస్ మోకాలు నొప్పి సమస్యతో బాధపడుతున్న సంగతి మనకు తెలిసిందే. బాహుబలి సినిమాలో ఎక్కువ శాతం యాక్షన్స్ సన్ని వేషాలలో పాల్గొనడంతో ఈయన తీవ్రమైనటువంటి మోకాలు నొప్పి సమస్యతో బాధపడుతున్నారు.
అప్పటినుంచి ఈ సమస్య తనని వెంటాడుతున్న శస్త్ర చికిత్స చేయించుకున్నారు. అయితే ఆ సమస్య మరింత తీవ్రమవుతున్నటువంటి నేపథ్యంలోనే ఈయన సర్జరీ చేయించుకున్నారని తెలుస్తుంది. ఇక ఈ విషయం తెలిసినటువంటి అభిమానులు త్వరగా ఈ సమస్య నుంచి బయటపడాలి అంటూ ప్రార్థిస్తున్నారు.