‘బాహుబలి’ తర్వాత ‘సాహో’ చిత్రీకరణలో బిజీ అయిపోయిన ప్రభాస్ నిన్న ఓ బాలీవుడ్ మ్యాగజైన్ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలో తన బాలీవుడ్ ఎంట్రీని కన్ఫర్మ్ చేశాడు. ఎప్పుడో మూడేళ్ళ క్రితమే అనగా “బాహుబలి” రిలీజ్ అయిన తర్వాతే తనకు ఓ ప్రేమకథ నచ్చిందని, ఆ కథతోనే బాలీవుడ్ ఎంట్రీ చేయాలనుకొంటున్నానని చెప్పాడు ప్రభాస్. నిజానికి “సాహో” అనంతరం “జిల్” ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తానని ప్రభాస్ సమ్మతించాడు. యువీ క్రియేషన్స్ సంస్థ నిర్మించబోయే ఈ సినిమా “సాహో” విడుదల అనంతరం ప్రారంభమవుతుందని అందరూ అనుకొన్నారు.
కానీ.. ప్రభాస్ రీసెంట్ ఎనౌన్స్ మెంట్ తో ఆ ప్రొజెక్ట్ అటకెక్కిందా లేక అదే ప్రొజెక్ట్ ను హిందీలో తీయాలని ప్లాన్ చేస్తున్నాడా అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇకపోతే.. ప్రభాస్ “జీక్యూ” మ్యాగజైన్ కోసం చేయించుకొన్న లేటెస్ట్ ఫోటోషూట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ సృష్టిస్తోంది. ప్రభాస్ రాయల్ లీక్ అదిరిందంటూ ప్రభాస్ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.
ఇకపోతే.. ప్రభాస్ ప్రస్తుతం “సాహో” సినిమా కోసం దుబాయ్ తో తెరకెక్కించబోతే యాక్షన్స్ సీన్స్ కోసం ట్రయినింగ్ తీసుకొంటున్నాడు. జనవరి 20 నుంచి సదరు యాక్షన్ షెడ్యూల్ మొదలవుతుంది.