ప్రభాస్‌తో (Prabhas) సినిమా చేయడం అంటే.. ఆయన ప్రేమ అనే స్వీట్ టార్చర్‌కు గురవ్వడమే అంటుంటారు టాలీవుడ్‌లో. బాలీవుడ్ జనాలకు కూడా ఈ విషయంలో అంతో కొంత పరిచయం కూడా ఉంది. ఆ మాటకొస్తే ఆయన పాన్ ఇండియా స్టార్ అయ్యాక అన్ని ఇండస్ట్రీలకు డార్లింగ్ ప్రేమ గురించి తెలుస్తోంది. ప్రభాస్ ప్రేమలో ముఖ్య భాగం భోజనానిదే అని చెప్పొచ్చు. తన సినిమాలో ముఖ్య నటులకు ఆయన ఇంటి నుండి ప్రత్యేక భోజనం వస్తుంది. ఇప్పుడు కొత్త కథానాయిక ఇమాన్వీకి ఇదే పరిస్థితి.
Imanvi
ప్రభాస్‌తో ఇమాన్వీ (Imanvi) ‘ఫౌజీ’ (పరిశీలనలో ఉన్న టైటిల్) అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. హను రాఘవపూడి (Hanu Raghavapudi) దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా సెట్స్‌లో ఇటీవల భారీ విందు భోజనం జరిగిందట. అది కూడా స్పెషల్‌గా ఇమాన్వికి. ఈ మేరకు ఆమె ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీగా అప్‌లోడ్ చేసింది. అందులో వెజ్, నాన్‌వెజ్ కలిపి ఓ పెద్ద హోటల్ తెరిచినట్లు కనిపిస్తోంది. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
డార్లింగ్‌తో ఈ మాత్రం ఉంటుంది. ఫుడ్ బాగా ఎంజాయ్ చేశావా అంటూ ఇమాన్వి వీడియో కింద ప్రభాస్ ఫ్యాన్స్ కామెంట్స్ కనిపిస్తున్నాయి. ప్రభాస్ తన కోస్టార్స్‌కు ప్రభాస్ ఫుడ్ పంపించడం ఇదేమీ తొలిసారి కాదు. గతంలో దీపికా పడుకొణె (Deepika Padukone) , కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan), శ్రుతి హాసన్ (Shruti Haasan) , నిధి అగర్వాల్ (Nidhhi Agerwal), మాళవికా మోహనన్ (Malavika Mohanan), పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) లాంటి వాళ్లు ప్రభాస్ ఇంటి భోజనం రుచి చూసినవారే. ఇప్పుడు ఆ సినిమా కష్టం ఇమాన్వికి (Imanvi) వచ్చిందన్నమాట.
ప్రభాస్ విషయానికొస్తే.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ‘ఫౌజీ’ పనుల్లో బిజీగా ఉన్న ఆయన.. ‘ది రాజా సాబ్’ (The Rajasaab) పూర్తి చేయాల్సి ఉంది. ఆ తర్వాత ‘సలార్ 2’, ‘కల్కి 2’ ఉన్నాయి. మరోవైపు సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’ (Spirit) కూడా ఉంది. వాటిలో ఏది ముందు, ఏది వెనుక అనేది తేలడం లేదు.