ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు కృష్ణవంశీ. ఆయన కెరీర్ లో ఎన్నో హిట్టు సినిమాలున్నాయి. గ్యాప్ లేకుండా సినిమాలు తీసిన ఆయన ఈ మధ్యకాలంలో బాగా డల్ అయ్యారు. ఆయన నుంచి వచ్చిన సినిమాలేవీ కూడా పెద్దగా వర్కవుట్ అవ్వడం లేదు. చివరిగా ‘నక్షత్రం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమా ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో తెలిసిందే. ఆ తరువాత ఆయన నుంచి మరో సినిమా రాలేదు.
కొంతకాలం పాటు గ్యాప్ తీసుకున్న ఆయన ‘రంగమార్తాండ’ అనే సినిమాను డైరెక్ట్ చేశారు. ఇందులో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం లాంటి నటీనటులు లీడ్ రోల్స్ పోషించారు. ఈ సినిమా అనౌన్స్మెంట్ వచ్చి చాలా కాలమైంది. కానీ ఇప్పటివరకు రిలీజ్ కాలేదు. ఈ ఏడాదిలోనే కచ్చితంగా సినిమా రిలీజ్ అవుతుందని ఆశించారు కానీ అలా జరగలేదు. కృష్ణవంశీ మాత్రం తన ఆర్టిస్ట్స్ డబ్బింగ్ చెబుతోన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఫ్యాన్స్ ను ఊరిస్తున్నారు.
సినిమా రిలీజ్ డేట్ మాత్రం చెప్పడం లేదు. కానీ మెల్లగా ప్రమోషన్స్ మాత్రం మొదలుపెట్టారు. రీసెంట్ గా ప్రకాష్ రాజ్ ఓ ఇంటర్వ్యూలో ‘రంగమార్తాండ’ సినిమా గురించి మాట్లాడారు. ఈ సినిమా కోసం ఓ ఆసక్తికర విషయం వెల్లడించారు. మరాఠీ సినిమా ‘నటసామ్రాట్’కి రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ‘నటసామ్రాట్’ రీమేక్ ను ముందుగా తనే డైరెక్ట్ చేయాలనుకున్నానని ప్రకాష్ రాజ్ చెప్పారు.
కానీ ఈ సినిమా తీయడానికి తన మిత్రుడైన కృష్ణవంశీనే కరెక్ట్ అని భావించి అతడి చేతికి ఈ సినిమాను అప్పగించినట్లు ప్రకాష్ రాజ్ తెలిపారు. ‘రంగమార్తాండ’ సినిమా తన కెరీర్ లో బెస్ట్ ఫిల్మ్ గా నిలుస్తుందని ప్రకాష్ రాజ్ అన్నారు. ఒక కొత్త ప్రకాష్ రాజ్ ను ప్రేక్షకులు చూస్తారని అన్నారు.