‘జిఏ2 పిక్చర్స్’ అండ్ ‘యూవీ క్రియేషన్స్’ సంస్థలు కలిసి నిర్మించిన తాజా చిత్రం ‘ప్రతీరోజు పండగే’. ఈ ఏడాది ‘చిత్రలహరి’ చిత్రంతో డీసెంట్ హిట్ కొట్టి ప్లాపుల నుండీ బయటపడిన సాయితేజ్.. ఈసారి ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ చేసి ఈ చిత్రం చేశాడు. ఇక రాశీ ఖన్నా ఈ చిత్రంలో ‘టిక్ టాక్’ కామెడీ తో బాగా ఎంటర్టైన్ చేసింది. ఈ చిత్రం కథ మొత్తం సత్య రాజ్ పాత్ర చుట్టూనే తిరుగుతుంది. ముఖ్యంగా ఈ చిత్రం మొత్తం క్రెడిట్ రావు రమేష్ కే దక్కుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. తన కామెడీ టైమింగ్ తో.. ప్రేక్షకుల కడుపు చెక్కలు చేసేస్తాడనే చెప్పాలి. ఇక డిసెంబర్ 20న విడుదలైన ఈ చిత్రం మొదటి వారం పూర్తికాకుండానే బ్రేక్ ఈవెన్ సాధించింది.
‘ప్రతీరోజూ పండగే’ 6 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :
నైజాం
6.56 cr
సీడెడ్
1.90 cr
ఉత్తరాంధ్ర
2.21 cr
ఈస్ట్
1.09 cr
వెస్ట్
0.85cr
కృష్ణా
1.14 cr
గుంటూరు
1.04 cr
నెల్లూరు
0.50 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
1.03 cr
ఓవర్సీస్
2.11 cr
వరల్డ్ వైడ్ టోటల్
18.43 cr (share)
‘ప్రతీరోజూ పండగే’ చిత్రానికి 18 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. 6 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం 18.43 కోట్ల షేర్ ను రాబట్టింది. నిన్న క్రిస్ట్మస్ రోజు సెలవుని ఈ చిత్రం బాగా క్యాష్ చేసుకుందనే చెప్పాలి. నిన్న ఈ చిత్రం ఏకంగా 3.10 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ చిత్రం ఫుల్ రన్ ముగిసేసరికి బ్లాక్ బస్టర్ గా నిలిచే ఛాన్స్ ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.