Bandla Ganesh: చూసుకోవాలి కదయ్యా బండ్ల గణేషు.!
- August 31, 2024 / 03:09 PM ISTByFilmy Focus
అప్పటివరకు ఒక సాధారణ ఆర్టిస్ట్ & ప్రొడ్యూసర్ గా మాత్రమే ప్రేక్షకులకు పరిచయమైన బండ్ల గణేష్ (Bandla Ganesh) ఇమేజ్ “గబ్బర్ సింగ్” (Gabbar Singh) ఆడియో ఫంక్షన్ తర్వాత ఒక్కసారిగా మారిపోయింది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram) స్పీచుల తర్వాత ఎక్కువ వైరల్ అయ్యింది బండ్ల గణేష్ స్పీచ్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. బండ్ల వాక్చాతుర్యం చూసి హేమాహేమీలు కూడా షాక్ అయ్యారు. ఇప్పటికే.. బండ్ల స్పీచుల్లో “పవనేశ్వరా” అనే పదం ఎంత వైరల్ అయ్యింది.
Bandla Ganesh

ఎన్ని పాటల్లో వాడారు అనేది ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అదే విధంగా.. ఆయన ట్వీట్లు కూడా సెన్సేషన్ క్రియేట్ చేసేవి. అలాంటి బండ్ల గణేష్ అప్పుడప్పుడు నోరు జారడం అనేది సర్వసాధారణం. ఫ్లోలో ఒక్కోసారి బూతులు కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఇవాళ జరిగిన “గబ్బర్ సింగ్” రీరిలీజ్ ప్రెస్ మీట్ లో కూడా బండ్ల గణేష్ అలవాటులో పొరపాటున ఓ బూతు మాట అనేసి, వెంటనే రియలైజ్ అయ్యి లైవ్ లోనే సారీ చెప్పేసారు కూడా.

అయితే.. ఆ క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నిజానికి బండ్ల ఈ ఈవెంట్లో చాలా మంచి విషయాలు మాట్లాడారు, పవన్ కల్యాణ్ తో తన వర్కింగ్ ఎక్స్ పీరియన్స్ గురించి, హరీష్ శంకర్ (Harish Shankar) వర్కింగ్ స్టైల్ గురించి ఇలా చాలా విషయాలు చెప్పుకొచ్చారు. కానీ.. అవన్నీ సైడ్ లైన్ అయిపోయి, కేవలం ఈ బూతు మాట మాత్రమే వైరల్ అవ్వడం గమనార్హం.

కనీసం ఇప్పటినుండైనా బండ్ల గణేష్ మాట్లాడేప్పుడు కాస్త ఆచితూచి మాట్లాడడం మంచిది. ఇకపోతే.. ఇదే ఈవెంట్ లో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పై అప్పట్లో బండ్ల గణేష్ రాజకీయ పరంగా వేసిన కొన్ని ట్వీట్ల విషయంలో బండ్లతో ఓ లేడీ రిపోర్టర్ వాగ్వాదానికి దిగడం కూడా చర్చనీయాంశంగా మారింది.
నరేంద్ర మోది, చంద్ర బాబు, చిరంజీవి, పవన్ కళ్యాణ్..
వీళ్లంతా Limited Edition.
వీళ్లందరినీ గౌరవించాలి, పూజించాలి, ప్రేమించాలి. అంతే కానీ..#BandlaGanesh #Chiranjeevi #PawanKalyan #RevanthReddy #Chandrababu #NarendraModi #FilmyFocus pic.twitter.com/zAydd0Qgai— Filmy Focus (@FilmyFocus) August 31, 2024












