టాలీవుడ్ డైరెక్టర్ నాగవంశీ (Suryadevara Naga Vamsi) కొన్ని సార్లు చాలా సెన్సిబుల్ గా మాట్లాడుతున్నారేమో అనిపిస్తుంటుంది. ఆయన ఎనాలసిస్ అనేది చాలా వరకు కరెక్ట్ గా ఉంటుంది. తాజాగా ఆయన రీ- రిలీజ్ సినిమాల విషయంలో చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. ఓ ఇంటర్వ్యూలో యాంకర్… ‘ఫస్ట్ రిలీజ్లో ఆడని సినిమాలు కూడా రీ- రిలీజ్లో తెగ ఆడేస్తున్నాయి. అప్పుడు ఫ్లాప్ అయిన సినిమాల్ని కూడా ఇది క్లాసిక్ కదా చూడండి అన్నట్లు చూస్తున్నారు.
ఉదాహరణకి ‘ఆరెంజ్’ (Orange) లాంటి సినిమాలు. చాలా మంది ఏమనుకుంటారు అంటే.. ఆరోజు మనం గమనించలేదు కానీ.. ఇది పెద్ద క్లాసిక్ అని అనుకుంటున్నారు. దానికి మీ ఒపీనియన్ ఏంటి?’ అంటూ నాగవంశీని ప్రశ్నించాడు. అందుకు నాగవంశీ.. ” అవన్నీ నాకు తెలీదు కానీ, మ్యూజిక్ వల్ల అవి ఆడుతున్నాయి. మీరు గమనించండి.. ఏ రీ- రిలీజ్ సినిమాకి అయినా మ్యూజిక్ సపోర్ట్ చేసిన రీ- రిలీజ్ కి ఎక్కువ క్రేజ్ ఉంటుంది.
చాలా మంది ఆడియన్స్ థియేటర్ కి వెళ్లి ఆ పాటల్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మ్యూజిక్ బాగున్న సినిమాలు అన్నీ అందుకే రీ- రిలీజ్ అవుతున్నాయి. అవి ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేస్తున్నాయి. ‘ఆరెంజ్’ లో పాటలు చాలా బాగుంటాయి. పాటలకి రీ- కాల్ వాల్యూ ఉంటే.. వాటిని ఎంజాయ్ చేయడానికి ఆడియన్స్ రెడీగా ఉన్నారు” అంటూ తన అభిప్రాయం చెప్పుకొచ్చాడు.
చాలా వరకు నాగవంశీ చెప్పింది నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే.. ‘ఓయ్’ (Oye) ‘సూర్య సన్ ఆఫ్ కృష్ణన్’ వంటి సినిమాలు రిలీజ్ అయినప్పుడు పెద్దగా ఆడలేదు. కానీ రీ- రిలీజ్లో బాగా వర్కౌట్ అయ్యాయి. ఆ సినిమాల్లో పాటలు చార్ట్ బస్టర్స్. అందుకే రీ- రిలీజ్లో కూడా వర్కౌట్ అయ్యి ఉండొచ్చు.