‘సితార ఎంటర్టైన్మెంట్స్’ అధినేత నాగవంశీ (Suryadevara Naga Vamsi).. ప్రస్తుతం మంచి ఫామ్లో ఉన్న నిర్మాత. ఈయన సినిమాలు మినిమమ్ గ్యారంటీ అనే విధంగా ఉంటాయి. అదే టైంలో మంచి కంటెంట్ కూడా ఉంటాయనే ప్రశంసలు అందుకుంటున్నాయి. నాగవంశీ నిర్మించిన ‘డాకు మహారాజ్’ (Daaku Maharaaj) రిలీజ్ కి రెడీగా ఉంది. జనవరి 12న సంక్రాంతి కానుకగా ఈ చిత్రం రిలీజ్ కాబోతోంది. ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్లో జరుగుతున్నాయి. ఈ క్రమంలో నాగవంశీ కూడా పలు ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నాడు.
Naga Vamsi
మరోపక్క సోషల్ మీడియాలో ఇతన్ని ట్రోల్ చేసే బ్యాచ్ కూడా ఎక్కువే. ఎందుకంటే.. ఏదైనా అప్డేట్ డిలే అయితే.. నెటిజన్లు రెచ్చిపోతూ ఉంటారు. ఆ టైంలో నాగవంశీ అగ్రెసివ్ గా కామెంట్స్ చేస్తూ ఉంటాడు. ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ బ్యానర్లో త్రివిక్రమ్ (Trivikram) డైరెక్ట్ చేసే సినిమాల వ్యవహారాలు కూడా ఇతనే చక్కబెడుతూ ఉంటాడు. ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) సినిమా టైంలో ఇతనికి కొంత మంది నెటిజన్లు ‘ఆటిట్యూడ్ చింటూ’ అంటూ ఇతనికి ఒక ట్యాగ్ తగిలించారు.
దీనిపై తాజాగా ఇతను స్పందించాడు. నాగ వంశీ మాట్లాడుతూ.. ‘మా అమ్మ నాన్న కూడా నాకు ముద్దు పేరు పెట్టలేదు. చిన్నప్పటి నుండి వంశీ అనే పిలిచేవారు. అలాగే పిలుస్తున్నారు. మరి సోషల్ మీడియాలో నాకు ఆ పేరు ఎందుకు పెట్టారో అర్థం కావడం లేదు. అయినప్పటికీ వాళ్ళు నన్ను డైరెక్ట్ గా వచ్చి ఆ పేరుతో(ఆటిట్యూడ్ చింటూ) అని పిలవరు కాబట్టి.. నేను పెద్దగా పట్టించుకోను’ అంటూ క్లారిటీ ఇచ్చాడు.