అనసూయ (Anasuya) ప్రధాన పాత్రలో ‘సింబా’ (Simbaa) అనే సినిమా రూపొందుతుంది. జగపతి బాబు (Jagapathi Babu) , కస్తూరి, దివి(Divya Vadthya), శ్రీనాథ్ (Srinath Maganti),, కబీర్ సింగ్ వంటి స్టార్లు కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. స్టార్ డైరెక్టర్ సంపత్ నంది (Sampath Nandi) ఈ చిత్రానికి కథ అందించడంతో పాటు ఓ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. రాజేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ట్రైలర్ కి రెస్పాన్స్ బాగానే వచ్చింది. ఆగస్టు 9 న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది.
ఇక ప్రమోషన్లలో భాగంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిర్మాత రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నారు. ‘తను రియల్ ఎస్టేట్ కి చెందిన వ్యక్తి అని, అయితే జర్నలిస్ట్ గా కెరీర్ ని ప్రారంభించానని, అలాగే నేచర్ లవర్ అని, అందుకే ‘సింబా’ కథ వినగానే ఓకే చేసానని, సినిమా బాగా వచ్చిందని, భవిష్యత్తులో కూడా మెసేజ్ ఉన్న సినిమాలనే నిర్మిస్తానని’ ఆయన తెలిపారు.
అంతేకాకుండా.. ‘సింబా’ టైటిల్ వెనుక కూడా ఇంట్రెస్టింగ్ స్టోరీని బయటపెట్టారు. ముందుగా ఈ చిత్రానికి ‘గాడ్ ఫాదర్’ (God Father) అనే టైటిల్ ను అనుకున్నారట. అదే టైటిల్ ను రిజిస్టర్ కూడా చేశారట. కానీ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) .. ‘గాడ్ ఫాదర్’ టైటిల్ కావాలని రిక్వెస్ట్ చేయడంతో ఇచ్చేశారట. ఆ తర్వాత ‘సింబా’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు చెప్పుకొచ్చారు రాజేందర్ రెడ్డి. అయితే కథ ప్రకారం.. ‘సింబా’ అనే టైటిల్ బాగా సెట్ అయ్యింది అని కూడా ఆయన అభిప్రాయపడ్డారు.