టాలీవుడ్ నిర్మాతలు ఆగష్టు 1వ తేదీ నుంచి షూటింగ్ లు ఆపాలని సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయం వల్ల లాభం కంటే నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే షూటింగ్ మొదలైన సినిమాల రిలీజ్ డేట్లు ఈ నిర్ణయం వల్ల మారే అవకాశం ఉంటుంది. ఇప్పటికే షూటింగ్ కోసం డేట్లు కేటాయించిన హీరోలు, హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు మళ్లీ షూటింగ్ లు మొదలయ్యే వరకు ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ నిర్ణయం వల్ల ప్రభాస్, రవితేజ, బాలకృష్ణ, పవన్, రామ్ చరణ్, విజయ్, విజయ్ దేవరకొండ సినిమాలపై ప్రభావం పడనుందని తెలుస్తోంది. షూటింగ్ లు ఆపడానికి కారణమేంటనే ప్రశ్నకు నిర్మాతలు చెబుతున్న కారణాలు వింతగా ఉన్నాయి. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో అనేక సమస్యలు ఉన్నాయని సమస్యల గురించి చర్చించడానికి కొంతమంది నిర్మాతలు ముందుకు రావడం లేదని గిల్డ్ ప్రొడ్యూసర్లు చెబుతున్నారు. కరోనా సమయంలో కొన్నిరోజులు షూటింగ్ లు నిలిచిపోయాయని గిల్డ్ ప్రొడ్యూసర్లు వెల్లడిస్తున్నారు.
సినిమా ఇండస్ట్రీకి ఏడాదికొకసారి సర్వీసింగ్ జరగాలని సినిమాకు ఒక రేటు పెడితే ఆడియన్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారని నిర్మాతలు అభిప్రాయపడుతున్నారు. సినిమా ఇండస్ట్రీకి పూర్వ వైభవం రావాలని నిర్మాతలు కోరుకుంటున్నారు. నిర్మాతలు కోరుకున్న విధంగా జరుగుతుందో లేదో చూడాల్సి ఉంది. షూటింగ్ లు ఆపాలని కొందరు నిర్మాతలు తీసుకున్న నిర్ణయం విషయంలో మిగతా నిర్మాతలు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.
కరోనా తర్వాతే ఈ విధమైన పరిస్థితులు ఏర్పడటంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పాజిటివ్ టాక్ వచ్చినా కొన్ని సినిమాలు అంచనాలను అందుకోలేకపోవడం గమనార్హం. గతంలో సినిమా ఇండస్ట్రీ ఎప్పుడూ ఈ తరహా పరిస్థితులను ఎదుర్కోలేదు. విడుదలైన కొన్ని వారాలకే సినిమాలు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండటం కూడా ఈ పరిస్థితికి కారణమని చెప్పవచ్చు. సినిమాల ఓటీటీ స్ట్రీమింగ్ విషయంలో నిర్మాతలు పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు.