రీసెంట్ గా దసరా పండగకు విడుదలైన నాగార్జున ‘ది ఘోస్ట్’ సినిమా ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో తెలిసిందే. రిలీజ్ కు ముందు ఈ సినిమాపై మంచి బజ్ వచ్చింది. కనీస స్థాయిలో సినిమా ఆడుతుందనుకున్నారు. కానీ వర్కవుట్ కాలేదు. ‘గాడ్ ఫాదర్’ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చినా.. ఐదు రోజుల తరువాత డౌన్ అయిపోయింది. అలాంటప్పుడు ‘ది ఘోస్ట్’ పరిస్థితి ఏంటో అర్ధం చేసుకోవచ్చు. ఈ సినిమా నిర్మాతలు సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహనరావులు డబ్బింగ్, శాటిలైట్ డీల్స్ లో ఎంత సేఫ్ అయ్యారనేది పక్కన పెడితే..
బయ్యర్లకు మాత్రం థియేట్రికల్ బిజినెస్ తో భారీ నష్టాలే వచ్చాయి. అందుకే ఇప్పుడు దాన్ని ‘ప్రిన్స్’ సినిమా భర్తీ చేయాలనే నమ్మకంతో సదరు నిర్మాతలు ఉన్నారు. సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థ భాగస్వామ్యంతో రూపొందిన ‘ప్రిన్స్’కు ‘జాతిరత్నాలు’ ఫేమ్ అనుదీప్ దర్శకత్వం వహించారు. అయితే మొదటి నుంచి ఈ సినిమాపై సరైన బజ్ లేదు. రీసెంట్ ట్రైలర్ విడుదలైన తరువాత కూడా హైప్ రాలేదు. రీసెంట్ గా విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది.
ఇదొక బైలింగ్యువల్ సినిమా అయినప్పటికీ.. ప్రిన్స్ లో డబ్బింగ్ ఫ్లేవరే ఎక్కువగా కనిపిస్తోంది. దానికి క్యాస్టింగ్ కూడా కారణమని చెప్పొచ్చు. తమన్ మ్యూజిక్ కూడా ఆశించిన స్థాయిలో కనెక్ట్ అవ్వలేదు. ఇవన్నీ ఒకటైతే.. బ్రిటిష్ అమ్మాయి పాత్రలో ఫారెన్ యువతిని తీసుకోవడంతో ఈ క్యారెక్టర్ మాస్ కి ఎంతవరకు కనెక్ట్ అవుతుందనే సందేహాలు కలుగుతున్నాయి.
పోనీ ‘ప్రిన్స్’ సోలోగా కూడా రిలీజ్ అవ్వడం లేదు. ‘ఓరి దేవుడా’, ‘సర్ధార్’, ‘జిన్నా’, ‘బ్లాక్ ఆడమ్’ వంటి సినిమాలతో పాటు ‘కాంతారా’తో కూడా పోటీ పడాల్సిన పరిస్థితి కలుగుతోంది. ఈ సినిమాతో తెలుగులో మార్కెట్ పెంచుకోవాలనుకుంటున్నారు శివ కార్తికేయన్. మరి సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి!