సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా తెరకెక్కిన పుష్ప 2: ది రూల్ (Pushpa 2: The Rule) విడుదల కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 12 వేలకు పైగా స్క్రీన్స్‌లో ఈ సినిమా విడుదల అవుతున్న నేపథ్యంలో, ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే అన్ని భాషల్లో అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డుల వైపు దూసుకుపోతున్నాయి. మొదట మేకర్స్ ఈ సినిమాను 3డీతో సహా మొత్తం ఏడు ఫార్మాట్స్‌లో రిలీజ్ చేస్తామని ప్రకటించారు.
Pushpa 3D
దీంతో, 3డీ (Pushpa 3D) ఫార్మాట్‌లో పుష్పరాజ్ యాక్షన్‌ను చూడాలని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే, లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం, 3డీ వెర్షన్ కోసం ఇంకాస్త సమయం పడుతుందని తెలిసింది. 3డీ ఫార్మాట్‌కు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా పూర్తి కాలేదట. 3డీ కన్వర్షన్‌కు అధునాతన సాంకేతికత అవసరమవ్వడంతో, సమయం ఎక్కువగా పట్టినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతానికి 2డీ వెర్షన్ మాత్రమే విడుదల కానుంది. ఇది అభిమానుల్లో కొంత నిరాశకు దారితీసింది. మరోవైపు, మేకర్స్ 2డీ వెర్షన్ అవుట్‌పుట్‌పై పూర్తి నమ్మకం ఉంచి, థియేటర్లలో ప్రేక్షకులకు అదిరిపోయే అనుభూతిని ఇవ్వడానికి కృషి చేస్తున్నారు. ఇప్పటికే 2డీ వెర్షన్ థియేటర్ కంటెంట్‌ను పలు సార్లు రివ్యూ చేసి, చిన్నపాటి మార్పులు, చేర్పులు చేస్తూ చివరి క్షణం వరకు కష్టపడుతున్నట్లు సమాచారం.
3డీ వెర్షన్ విడుదలకు మరికొన్ని వారాల సమయం పట్టే అవకాశం ఉంది. ఈ వెర్షన్ ఆలస్యం అయినా, సినిమా థియేట్రికల్ అనుభవంపై మాత్రం ప్రభావం పడదని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. పైగా, పుష్ప 2 సీక్వెల్ క్రేజ్ తారాస్థాయిలో ఉండటంతో, ప్రేక్షకులు 2డీతోనే ఎంజాయ్ చేయడం ఖాయమని తెలుస్తోంది.