స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా మారిన అల్లు అర్జున్ పుష్ప సినిమాతో మొత్తానికి బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో ఓపెన్ అయితే అందుకున్నాడు. ఇక సినిమా ప్రపంచవ్యాప్తంగా పెట్టిన పెట్టుబడికి ఓపెనింగ్స్ బాగానే అందుకుంది. కానీ ఇంకా మరో పది కోట్ల వరకు షేర్ వసూళ్లను అందుకుని లాభాల్లోకి వచ్చినట్లు లెక్క. ముఖ్యంగా హిందీలో సినిమా కేజిఎఫ్ 1 రికార్డును కూడా బ్రేక్ చేసింది. మొత్తంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక వసూళ్లను సాధించిన సౌత్ సినిమాల్లో పుష్ప సినిమా 5వ స్థానం దక్కించుకుంది.
ఈ సినిమాకు సంబంధించిన ఒక డిలిటెడ్ సన్నివేశాన్ని కూడా యూట్యూబ్ లో విడుదల చేశారు.పుష్ప సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించాలని దర్శకుడు సుకుమార్ మొదటి భాగంలోనే దాదాపు గంటకుపైగా సీన్లను వృధాగా షూట్ చేసినట్లు తెలుస్తోంది. అంటే ఖర్చు పరంగా 30 కోట్ల వరకు అనవసరమైన సన్నివేశాలు చేశారని సమాచారం. ఇక మొదటి భాగంలో ఒక సీన్ బాగానే ఉన్నప్పటికీ అనవసరమని ఆ సన్నివేశాన్ని తీసేశారు. గొడ్డు మాట వినదు, కొడుకు మాట వినడు అనే డైలాగ్ ఆధారంగా ఆ సన్నివేశాన్ని హైలైట్ చేసినట్లు కనిపిస్తోంది.
తీసుకున్న వ్యక్తి పరువు పోయేలా అప్పు అడగడంతో గొడ్డును అమ్మేస పుష్పరాజ్ ఆ అప్పు తీర్చేస్తాడు. ఇక ఆ తర్వాత అతనికి వడ్డీతో సహా ఇచ్చినప్పటికీ పరువు కూడా మళ్ళీ తిరిగి రావాలని అంటాడు. అందరి ముందు నా పరువు తీశారు కాబట్టి ప్రతి ఒక్కరికీ మేము మళ్ళీ నీకు డబ్బులు ఇచ్చినట్లుగా చెప్పాలి అనే అతన్ని కొట్టుకుంటూ ప్రతీ ఇంటికి తీసుకు వెళతాడు. ఈ సీన్ ఒక విధంగా బాగానే ఉన్నప్పటికీ సినిమాకు అవసరం లేదు అని చెప్పాలి.
ఇప్పటికే మూడు గంటల వరకు సినిమా చాలా ఎక్కువ నిడివిలో ఉంది అనే విమర్శలు కూడా చాలా వచ్చాయి. కానీ దర్శకుడు సుకుమార్ ఆ సమయంలో కూడా సినిమాను ఇంకా అనుకున్నంతగా ప్రజెంట్ చేయలేకపోయాడు.