ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) నటించిన ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule) మేనియా నడుస్తుంది. ఇది ‘పుష్ప'(ది రైజ్) కి సీక్వెల్. అయితే ‘పుష్ప'(ది రైజ్) (Pushpa) రిలీజ్ అయ్యి నేటితో 3 ఏళ్ళు పూర్తి కావస్తోంది. దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం 2021 డిసెంబర్ 17న విడుదల అయ్యింది. ‘ముత్తంశెట్టి మీడియా’ సంస్థతో కలిసి ‘మైత్రి మూవీ మేకర్స్’ వారు దాదాపు రూ.250 కోట్లు బడ్జెట్ తో నిర్మించారు. మొదట ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది.
Pushpa Collections:
అయితే నార్త్ లో సూపర్ హిట్ టాక్ వచ్చింది. అక్కడ భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో కూడా తర్వాత పికప్ అయ్యింది. ఓవరాల్ గా బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ఒకసారి ‘పుష్ప'(ది రైజ్) క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే :
‘పుష్ప'(ది రైజ్) రూ.146 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం అన్ని వెర్షన్లు కలుపుకుని రూ.165.15 కోట్ల షేర్ ను రాబట్టింది. ఫైనల్ గా రూ.19.15 కోట్ల లాభాలతో ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కాకపోయినా.. మొత్తంగా సూపర్ హిట్ మూవీ అనే చెప్పాలి.