‘అల వైకుంఠపురములో’ చిత్రం తర్వాత అల్లు అర్జున్ చేస్తున్న ‘పుష్ప’ చిత్రం పై భారీ అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే ఇది బన్నీ- సుకుమార్ కాంబినేషన్లో రాబోతున్న మూడో సినిమా కాగా ‘రంగస్థలం’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత సుకుమార్ నుండీ రాబోతున్న చిత్రం. పాటలు, టీజర్, ట్రైలర్ లు సినిమా పై ఉన్న అంచనాలను డబుల్ చేసాయి కూడా..! డిసెంబర్ 17న ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.
‘మైత్రి మూవీ మేకర్స్’ వారు మరో సంస్థ ‘ముత్తంశెట్టి మీడియా’ వారితో కలిసి సుమారు రూ.200కోట్లకి పైగా బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘అఖండ’ చిత్రం టాలీవుడ్ కు కొత్త ఆశలు పుట్టించింది.అదే బాటలో ‘పుష్ప’ చిత్రం టాలీవుడ్ కు పూర్వ వైభవాన్ని తీసుకొస్తుందని చిత్ర బృందం ఆశాభావం వ్యక్తం చేస్తుంది. ఇదిలా ఉండగా… ఈ చిత్రం రన్ టైం విషయంలో టీం కొంత టెన్షన్ పడుతున్నట్టు వినికిడి.
సినిమా నిడివి 3 గంటల 4 నిమిషాల వరకు వచ్చేస్తుందట. థియేటర్లలో వచ్చే యాడ్లతో కలుపుకుంటే సినిమా మూడున్నర గంటలు ఉంటుందన్న మాట. సుకుమార్ గత చిత్రం ‘రంగస్థలం’ కూడా 3గంటల పైనే నిడివి కలిగిన సినిమానే.! అయినప్పటికీ ఆ చిత్రానికి అది మైనస్ కాలేదు. మరి ‘పుష్ప’ విషయంలో కూడా అదే రిపీట్ అవుతుందేమో చూడాలి..!