ప్రభాస్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన రాధేశ్యామ్ మరో ఐదు వారాల్లో థియేటర్లలో విడుదల కానుంది. ప్రభాస్ సినిమా సాహో విడుదలై రెండున్నర సంవత్సరాలు కావడంతో ప్రభాస్ అభిమానులు ఈ సినిమా కొరకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణా బ్యానర్ పై సంయుక్తంగా ఈ సినిమా తెరకెక్కడం గమనార్హం. అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఏకంగా 10,000 థియేటర్లలో రిలీజ్ కానుంది. అమెరికాలో మాత్రమే ఈ సినిమా 2,000కు పైగా థియేటర్లలో రిలీజ్ కానుందని సమాచారం.
10,000 థియేటర్లలో రిలీజ్ కానున్న ఈ సినిమాకు హిట్ టాక్ వస్తే మాత్రం బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో రికార్డులు క్రియేట్ అవుతాయని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. రాధేశ్యామ్ రిజల్ట్ పై ఉండే నమ్మకం వల్లే మేకర్స్ ఈ స్థాయిలో థియేటర్లలో సినిమాను రిలీజ్ చేస్తున్నారని సమాచారం అందుతోంది. ఇప్పటివరకు ఏ తెలుగు హీరో సినిమా రిలీజ్ కాని స్థాయిలో ఈ సినిమా రిలీజ్ కానుంది.
ప్రభాస్ కు బాహుబలి సిరీస్ సినిమాలతో మన దేశంతో పాటు విదేశాల్లో కూడా ఊహించని స్థాయిలో క్రేజ్ వచ్చింది. ఆ క్రేజ్ వల్లే ఈ సినిమాకు ఊహించని స్థాయిలో థియేటర్లు దక్కాయని తెలుస్తోంది. అయితే రాధేశ్యామ్ ప్రమోషన్స్ ఆశించిన స్థాయిలో జరగడం లేదని ప్రభాస్ అభిమానులు ఒకింత నిరాశతో ఉన్నారు. ఈ సినిమాకు రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. ప్రభాస్ రాధేశ్యామ్ సినిమాలో హస్తసాముద్రికుడిగా కనిపించనున్నారు. వరుసగా యాక్షన్ సినిమాలు చేసిన ప్రభాస్ తన శైలికి భిన్నమైన కథలో రాధేశ్యామ్ సినిమాలో నటించడం గమనార్హం.
రాధేశ్యామ్ తో ప్రభాస్ ఎలాంటి రిజల్ట్ ను సొంతం చేసుకుంటారో చూడాల్సి ఉంది. గోల్డెన్ లెగ్ గా పేరు సంపాదించుకున్న పూజా హెగ్డే ఈ సినిమాతో మరో విజయాన్ని అందుకుంటారేమో చూడాలి. కృష్ణంరాజు ఈ సినిమాలో కీలకపాత్రలో నటించగా ప్రభాస్ తల్లి పాత్రలో భాగ్యశ్రీ నటించారు.