సినీ నటుడు రాఘవ లారెన్స్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. తాజాగా ఈయన చంద్రముఖి సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. అదే విధంగా దీపావళి పండుగ సందర్భంగా జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో చెన్నైలో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సక్సెస్ మీట్ కార్యక్రమానికి చిత్ర బృందం హాజరై సందడి చేశారు.
జిగర్ తండ-2 విడుదలకు రెండు రోజుల ముందుగా సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్, హీరో ధనుష్ చూసి సూపర్బ్‌గా ఉన్నట్టు ట్వీట్ చేశారు. ఇక ఈ సినిమా గురించి ప్రముఖ నటుడు సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా ప్రశంసలు కురిపించారు అంటూ లారెన్స్ తెలియజేశారు. ఈ సినిమా చూసిన తర్వాత రజనీకాంత్ గారు స్వయంగా తనకు ఫోన్ చేసి మరి ప్రశంసించారని లారెన్స్ తెలిపారు.
ఈ సినిమా చూసిన తర్వాత రజనీకాంత్ ఫోన్ చేసి ప్రశంసలకు కురిపించడమే కాకుండా ఇంటికి పిలిపించుకొని మరి అభినందించారు. ఇప్పటికీ మర్చిపోలేనని ఈ సందర్భంగా లారెన్స్ తెలియజేశారు. అలాగే చిత్ర బృందాన్ని అభినందిస్తూ ఈయన లేక కూడా రాయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. లారెన్స్ రజనీకాంత్ ని తన గురువుగా భావిస్తారనే సంగతి తెలిసిందే.
ఇక లారెన్స్ (Raghava Lawrence) ఎక్కువగా రాఘవేంద్ర స్వామిని పూజిస్తారు అయితే తాను కొలిచే రాఘవేంద్ర స్వామిని ఇప్పటివరకు తాను కనులారా చూడలేదు కానీ తన గురువుగారు అయినటువంటి రజనీకాంత్ గారిలో నేను రాఘవేంద్ర స్వామిని చూసుకున్నాను అంటూ లారెన్స్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమాకు డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించిన సంగతి మనకు తెలిసింది ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో చిత్ర బృందం ఎంత సంతోషం వ్యక్తం చేస్తున్నారు.