K. S. శంకర్ రావ్, G. రాంబాబు యాదవ్, R. వెంకటేశ్వర్ రావు (Producer)
సంజీవ్ మేగోటి – సుధాకర్ మారియో (Music)
ఎస్.ఎన్.హరీష్ (Cinematography)
Release Date : డిసెంబర్ 29, 2023
ఎప్పటిలానే 2024 జనవరి మొదటి వారంలో కూడా పెద్ద సినిమాలు రిలీజ్ అవ్వడం లేదు. దీంతో చాలా చిన్న సినిమాలు ఈ జనవరి 5వ తేదీని టార్గెట్ చేశాయి. అందులో ‘రాఘవరెడ్డి’ అనే సినిమా కూడా ఒకటి. టైటిల్ పవర్ఫుల్ గా ఉండటం,సీనియర్ హీరోయిన్ రాశి, నందిత శ్వేతా.. వంటి వారు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించడం వంటివి ప్రేక్షకులను ఆకర్షించే అంశాలుగా చెప్పుకోవచ్చు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంత వరకు మెప్పించిందో ఓ లుక్కేద్దాం రండి :
కథ: లక్కీ అలియాస్ మహాలక్ష్మి (నందితా శ్వేతా) దేవకీ (రాశి) కూతురు.వీరు తెలంగాణాకు చెందిన వాళ్ళే అయినప్పటికీ, మహాలక్ష్మీ చదువు కోసం వైజాగ్ కి వస్తుంది దేవకీ. మహాలక్ష్మీ పనిచేసే కాలేజీలో రాఘవ రెడ్డి (శివ కంఠమనేని) క్రిమినాలజీ ప్రొఫెసర్ గా పనిచేస్తూ ఉంటాడు. పోలీసులు సైతం సాల్వ్ చేయలేని కేసులను ఈయన సాల్వ్ చేసి ప్రశంసలు అందుకుంటూ ఉంటాడు. అందువల్ల పోలీసులు కూడా రాఘవరెడ్డి హెల్ప్ తీసుకుంటూ ఉంటారు. ఈయన కాలేజీలో కూడా స్ట్రిక్ట్ గా ఉంటాడు. అయితే మహాలక్ష్మీ అలియాస్ లక్కీ చాలా అల్లరి పిల్ల.
ఒకసారి ఈమె రాఘవరెడ్డి దృష్టిలో పడుతుంది. ఈమె చేస్తున్న పనులు నచ్చక రాఘవరెడ్డి.. ఈమెకి ఓ రోజు గట్టిగా క్లాస్ పీకుతాడు. అయితే ఊహించని విధంగా రాఘవరెడ్డికి… మహాలక్ష్మీ అలియాస్ లక్కీ కూతురు అని తెలుస్తుంది. మరోపక్క ఆమె కిడ్నాప్ కి గురవుతుంది. అసలు రాఘవరెడ్డి.. దేవకీతో ఎందుకు విడిపోయాడు? చివరికి కూతుర్ని కాపాడుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? దేవకీ – రాఘవరెడ్డి చివరికి కలుసుకున్నారా? అనేది మిగిలిన కథ.
నటీనటుల పనితీరు: శివ కంఠమనేని.. సినిమా సినిమాకి నటుడిగా ఇంప్రూవ్ అవుతూనే వస్తున్నారు. ఈ సినిమా విషయానికి వస్తే.. రాఘవరెడ్డి పాత్ర అతనికి పెర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది. శివ కంఠమనేని కూడా తన పాత్రని బాగా ఓన్ చేసుకుని నటించారు. యాక్షన్ సీన్స్ లో కూడా గ్రేస్ చూపించారు.సీనియర్ హీరోయిన్ రాశి ఈ సినిమాలో కొంచెం యంగ్ గా కనిపించింది అని చెప్పాలి. ఎమోషనల్ సీన్స్ లో ఆమె ఆకట్టుకుంది. నందిత శ్వేతా పర్వాలేదు. ఇక పోసాని కృష్ణమురళి, అజయ్ ఘోష్, బిత్తిరి సత్తి వంటి వారు తమ తమ పాత్రలకి తగ్గట్టు బాగానే నటించారు.
సాంకేతిక నిపుణుల పనితీరు: సంజీవ్ మేగోటి ఎంపిక చేసుకున్న ఈ కథ కమర్షియల్ మీటర్లోనే సాగింది. ఇలాంటి కథ సీనియర్ స్టార్ హీరోలు చేస్తే ఇంకా బాగుండేదేమో. అయినప్పటికీ దర్శకుడు తన టేకింగ్ తో ప్రేక్షకులను బాగానే కూర్చోబెట్టగలిగాడు. అలా అని మైనస్ పాయింట్స్ లేవా అంటే ఉన్నాయి. ఎమోషనల్ కనెక్టివిటీ కొంత లోపించింది. భర్తతో దేవకీ ఎందుకు విడిపోయింది అనే సస్పెన్స్ ఫస్ట్ హాఫ్ లో బాగానే అనిపించినా.. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో అది ఫోర్స్డ్ గా అనిపిస్తుంది. పేరున్న క్యాస్టింగ్ ఉండటం వల్ల కామెడీ ఓ మోస్తరుగా ఉన్నా చెల్లిపోయింది. పాటలు పెద్దగా గుర్తుండవు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అనేది యాక్షన్ సీన్స్ వచ్చినప్పుడు బాగానే అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. రన్ టైం కూడా 2 గంటల 2 నిమిషాలు మాత్రమే కావడం మరో ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు.
విశ్లేషణ: మొత్తంగా యాక్షన్,ఫ్యామిలీ ఎలిమెంట్స్ తో రూపొందిన ఈ ‘రాఘవరెడ్డి’.. టార్గెటెడ్ ఆడియన్స్ ని కొంతవరకు సంతృప్తి పరిచే ఛాన్సులు ఉన్నాయి.
రేటింగ్ : 2.5/5
Rating
2.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus