కరోనా వైరస్ కారణంగా చిత్ర పరిశ్రమలు కుదేలవ్వగా, భారీ చిత్రాలకు విడుదల మరియు చిత్రీకరణకు పెద్ద ఆటంకంగా తయారైంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలు విడుదల చేయలేని పరిస్థితి, అలాగే కొత్త చిత్రాలు చిత్రీకరించలేని ఇబ్బంది నెలకొంది. చిన్న చిత్రాల షూటింగ్ అంటే కొంచెం ఎలాగొలా పూర్తి చేయవచ్చు. ఆర్ ఆర్ ఆర్ లాంటి ఓ భారీ చిత్రాన్ని ఆంక్షల మధ్య చిత్రీకరించడం జరగని పని. ఎందుకంటే ఈ సినిమా షూటింగ్ లో వందల మంది జూనియర్ ఆర్టిస్టులు, పదుల సంఖ్యలో సాంకేతిక నిపుణులు పాల్గొనాల్సి ఉంటుంది. అలాగే వివిధ రాష్ట్రాల వారు మరియు దేశాల వారు కూడా ఈ సినిమాకు పని చేస్తున్నారు.
మరి రాష్ట్రాల మధ్య రవాణా లేకపోవడంతో పాటు దేశాల మధ్య రాకపోకలు నిషేధించారు. మరి ఈ పరిస్థితులలో రాజమౌళి మిగిలిన ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ ఎలా పూర్తి చేస్తాడు అనేది పెద్ద సమస్యగా మారింది. దీనికి రాజమౌళి చెప్పిన సమాధానం ఏమిటంటే.. ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమాకు పనిచేసి సభ్యులను సమీకరిస్తున్నారట. వారు ఎక్కడెక్క ఉంది, వారిని ఎలా ఇక్కడకు రప్పించగలం అనేది ఆలోచిస్తున్నారట. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వనరులను, సాంకేతిక నిపుణులను ఉపయోగించుకొని కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తారట.
అలాగే వందల మంది జూనియర్ ఆర్టిస్ట్లులు అవసరం లేకుండా తక్కువ మందితో ఎలా చిత్రీకరించగలం అనే మార్గాలను కూడా రాజమౌళి అన్వేషిస్తున్నారట. ఇక విదేశీ నిపుణులు, నటీనటులు అవసరమయ్యే సన్నివేశాల చిత్రీకరణ సాధారణ పరిస్థితులు ఏర్పడిన తరువాత చిత్రీకరిస్తారట. జక్కన ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ త్వరగా పూర్తి చేసి, చెప్పిన టైం కి రావడానికి ఇంత పెద్ద ప్రణాళిక వేశారట.