దర్శకధీరుడు రాజమౌళి తన ప్రతిభతో అంతకంతకూ ఎదుగుతూ అదే సమయంలో తెలుగు సినిమాల ఖ్యాతిని సైతం ఊహించని స్థాయిలో పెంచుతున్నారు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ అంటే ష్యూర్ షాట్ హిట్ అని ప్రేక్షకుల్లో భావన ఉంది. ఇతర ఇండస్ట్రీల నుంచి భారీ రెమ్యునరేషన్లతో ఆఫర్లు వచ్చినా జక్కన్న మాత్రం ఆ ఆఫర్లకు నో చెబుతుండటం గమనార్హం. ఈ మధ్య కాలంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో తెరకెక్కిన సినిమాలలో మెజారిటీ సినిమాలు ఫ్లాప్ అయ్యాయనే సంగతి తెలిసిందే.
బాలీవుడ్ సినిమాలు నిర్మాతలకు కూడా భారీ నష్టాలను మిగల్చడం హాట్ టాపిక్ అవుతోంది. అయితే బాలీవుడ్ సినిమాల ఫలితాల గురించి జక్కన్న ఆసక్తికర వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటం గమనార్హం. బాలీవుడ్ ఇండస్ట్రీలోకి కార్పోరేట్లు అడుగుపెడుతున్నారని వాళ్లు అడుగుపెట్టినప్పటి నుంచి డైరెక్టర్లు, నటీనటులకు పారితోషికాలు పెరిగాయని రాజమౌళి తెలిపారు. ఏదో ఒక విధంగా డబ్బు చేతికి వస్తుండటంతో సక్సెస్ ను సొంతం చేసుకోవాలనే కసి వాళ్లలో కొంత తగ్గిందని రాజమౌళి అభిప్రాయపడ్డారు.
ఈ రీజన్ వల్లే బాలీవుడ్ సినిమాలు ఎక్కువగా సక్సెస్ సాధించడం లేదని రాజమౌళి పేర్కొన్నారు. సౌత్ ఇండియాలో మాత్రం భిన్నమైన పరిస్థితి ఉందని జక్కన్న కామెంట్లు చేశారు. సౌత్ లో సక్సెస్ కోసం ఈదాలని లేకపోతే మునిగిపోవాలని రాజమౌళి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం సౌత్ సినీ ఇండస్ట్రీ బాగా రాణిస్తోందని జక్కన్న అన్నారు.
అయితే సినిమా ప్రకటనకు వచ్చిన ఆదరణను చూసి పొంగిపోకూడదని సినిమాకు జరిగిన బిజినెస్ చూసి ఆత్మసంతృప్తి చెందకూడదని ప్రేక్షకుల ముందుకు సినిమా వచ్చే వరకు తీవ్రంగా కృషి చేయాలని రాజమౌళి అభిప్రాయపడ్డారు. రాజమౌళి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జక్కన్న కామెంట్లపై బాలీవుడ్ స్టార్స్, బాలీవుడ్ దర్శకనిర్మాతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.