అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పాన్ ఇండియా సినిమా పుష్ప. ఈ సినిమా ద్వారా మన ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ ఇండియా లెవెల్ హీరోగా గుర్తింపు పొందాడు. ఇటీవల విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కొత్త రికార్డులను క్రియేట్ చేసింది. ముఖ్యంగా ఈ సినిమాలో అల్లు అర్జున్ నటనకు అందరూ ఫిదా అయిపోయారు. ఈ సినిమాలో వైవిధ్యమైన నటనతో అల్లు అర్జున్ సౌత్ ప్రేక్షకులను బాగా ఆకర్షించాడు.
పుష్ప సినిమాలో ఎర్రచందనం స్మగ్లర్ గా అల్లు అర్జున్ నటన గురించి పలువురు ప్రముఖులు కూడా ప్రశంసలు కురిపించారు. దర్శక ధీరుడు రాజమౌళి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సినిమా భారీ సక్సెస్ అవ్వటానికి గల సీక్రెట్ గురించి చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నార్త్ లో పుష్ప సినిమా ఇంత మంచి సక్సెస్ అవ్వడానికి ముఖ్య కారణం సుకుమార్. పుష్ప సినిమా ఒక ప్రపంచం. అలాంటి ప్రపంచంలో కొన్ని లోపాలు ఉండటం సహజం.
కానీ ఎవరికి సుకుమార్ క్రియేటివిటీని ప్రశ్నించే హక్కు లేదు. ఎందుకంటే క్రియేటివిటీలో సుకుమార్ మాష్టర్. అంటూ సుకుమర్ క్రియేటివిటీ గురించి రాజమౌళి చాలా గొప్పగా చెప్పుకొచ్చారు. ఇక ఈ సినిమా సక్సెస్ అవటానికి రెండవ కారణం గురించి రాజమౌళి మాట్లాడుతూ.. క్యారెక్టరైజేషన్ కూడా ఈ సినిమా సక్సెస్ అవ్వటానికి ఒక ముఖ్య కారణం అని చెప్పుకొచ్చాడు. చాలా కాలం నుండి నార్త్ లో సాఫ్ట్ అండ్ ఫీల్ గుడ్ మూవీస్ వస్తున్నాయి.
ఇప్పుడు పుష్ప సినిమాలో మాస్ అండ్ రస్టిక్ క్యారెక్టర్ ఉండటంతో హిందీ ఆడియన్స్ ఈ సినిమాకి బాగా కనెక్ట్ అయ్యారు. అని ఆయన చెప్పుకొచ్చారు. పుష్ప సినిమా పాన్ ఇండియా హిట్ కి గల కారణాల గురించి రాజమౌళి చెప్పిన సీక్రెట్స్ ఇవే. ప్రస్తుతం అం సుకుమార్ పుష్ప 2 సినిమా పనిలో ఉన్నారు. తొందర్లోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.