టాలీవుడ్ ఇండస్ట్రీలో రాజమౌళి, ప్రశాంత్ నీల్ లకు ఏ స్థాయిలో క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఇద్దరు దర్శకులు నూటికి నూరు శాతం సక్సెస్ రేట్ ఉన్న దర్శకులుగా గుర్తింపును సంపాదించుకున్నారు. ఈ దర్శకులు స్టార్ హీరోలతో సినిమాలను తెరకెక్కిస్తే ఆ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లు కావడం ఖాయమని ఇప్పటికే ప్రూవ్ అయింది. అయితే ఈ ఇద్దరు డైరెక్టర్ల మధ్య చాలా తేడాలు ఉన్నాయి.
రాజమౌళి తన సినిమాలో ప్రతి సీన్ ఎలాంటి గందరగోళం లేకుండా కన్ఫ్యూజన్ కు గురి చేయకుండా తీయడానికి ప్రయత్నిస్తారు. ప్రశాంత్ నీల్ కథలో ఒకింత కన్ఫ్యూజన్ ఉన్నా ప్రేక్షకులకు గూస్ బంప్స్ వచ్చే సీన్లకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. రాజమౌళి నిదానమే ప్రధానం అనే ఫార్ములాను ఫాలో అయితే ప్రశాంత్ నీల్ మాత్రం తన సినిమాలను వీలైనంత వేగంగా పూర్తి చేస్తారు. సలార్ మూవీ షూట్ కేవలం 114 రోజుల్లో పూర్తైంది.
జక్కన్న తన సినిమాలలో పాటలు కచ్చితంగా ఉండేలా చూసుకుంటారు. ప్రశాంత్ నీల్ మాత్రం కథకు అవసరం అయితే మాత్రమే పాటలు ఉండేలా జాగ్రత్త పడతారు. ప్రశాంత్ నీల్ డార్క్ షేడ్ లో సినిమా తీయడానికి ఇష్టపడితే రాజమౌళి సినిమా కలర్ ఫుల్ గా ఉండేలా చూసుకుంటారు. రాజమౌళి సినిమా ప్రమోషన్స్, మార్కెటింగ్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే ప్రశాంత్ నీల్ వీటికి ప్రాధాన్యత ఇవ్వరు.
రాజమౌళి రెమ్యునరేషన్ తో పాటు లాభాల్లో వాటా తీసుకుంటారు. ప్రశాంత్ నీల్ మాత్రం పారితోషికం మాత్రమే తీసుకుంటారు. అయితే ఈ ఇద్దరు దర్శకుల మధ్య కొన్ని పోలికలు కూడా ఉన్నాయి. ఈ ఇద్దరు దర్శకులు భారీ కథలను, ఎవరి ఊహలకు అందని కథలను తెరకెక్కిస్తారు. క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా సినిమానే ప్రపంచంగా బ్రతుకుతారు. సినిమా రిలీజయ్యే చివరి నిమిషం వరకు బెటర్ ఔట్ పుట్ కోసం కష్టపడతారు. ఈ దర్శకుల సక్సెస్ లో కుటుంబ సభ్యుల సపోర్ట్ కూడా కొంతమేర ఉంది. అయితే క్రేజ్, పాపులారిటీ, ఫ్యాన్ ఫాలోయింగ్ విషయంలో ఈ ఇద్దరూ ఈక్వల్ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.