బాహుబలి2 సినిమాతో ప్రపంచవ్యాప్తంగా రాజమౌళి పేరు మారుమ్రోగింది. తెలుగులో ఇప్పటివరకు ఏ సినిమా క్రియేట్ చేయని స్థాయిలో ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేసింది. బాహుబలి2 తర్వాత రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాపై భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల్లో భారీస్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. మూడుసార్లు సినిమా వాయిదా పడిన తర్వాత 2022 సంవత్సరం జనవరి 7వ తేదీని ఆర్ఆర్ఆర్ యూనిట్ రిలీజ్ డేట్ గా ఎంచుకుంది. ఈ ఏడాది అక్టోబర్ 13వ తేదీన రిలీజ్ కావాల్సిన ఈ సినిమా రిలీజ్ డేట్ ను కరోనా సెకండ్ వేవ్ వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో మార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది.
కొత్త రిలీజ్ డేట్ ప్రకటన ద్వారా రాజమౌళి అటు ప్రేక్షకులకు రాధేశ్యామ్, సర్కారు వారి పాట, భీమ్లా నాయక్ మేకర్స్ కు భారీ షాక్ ఇచ్చారు. ఇండస్ట్రీ జనాలు ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ విషయంలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతికి మూడు పెద్ద సినిమాలు విడుదలైతే ఆ సినిమాలకు థియేటర్లు సర్దుబాటు చేయడం తేలిక కాదు. ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజైతే సంక్రాంతి సినిమాలకు థియేటర్లు లభించడం తేలిక కాదు.
సంక్రాంతికే తమ సినిమా పక్కా అని సర్కారు వారి పాట, భీమ్లా నాయక్, రాధేశ్యామ్ మేకర్స్ ప్రకటిస్తున్నా ‘ఆర్ఆర్ఆర్’ విషయంలో ఆయా సినిమాల నిర్మాతలు తెగ టెన్షన్ పడుతున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ మేకర్స్ పై సంక్రాంతి సినిమాల నిర్మాతలు ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది. ‘ఆర్ఆర్ఆర్’ మరోసారి వాయిదా పడే ఛాన్స్ ఉందని వార్తలు వస్తున్నాయి. రాజమౌళి మౌనం వీడి ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ డేట్ కు సంబంధించి పూర్తిస్థాయిలో క్లారిటీ ఇస్తే బెటర్ అని కామెంట్లు వినిపిస్తున్నాయి.